https://oktelugu.com/

Tribiyand Tribes : వామ్మో పెళ్లి చూపుల్లో ఇంత దారుణమైన ఆచారమా? వధువును అలా చూస్తారా?

పెళ్లి చూపుల్లో అమ్మాయి మొహం, గుణగణాలు తెలుసుకోవాలి కానీ ఈ ఆచారం ఏంటి అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వింత ఆచారాల వల్ల తెగ జాతి మనుగడకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. అందుకు ఇప్పటికి అయినా స్థానిక అధికారులు సరైన చట్టాలు తీసుకోవాలి అని కోరుతున్నారు ప్రజలు.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 3:15 pm
    Follow us on

    Tribiyand Tribes : పెళ్లంటే నూరెళ్ల పంట. మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యే ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలి. అలా కలిసి ఉండడానికి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఉండాలి. అయితే పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతంలో ఓక్కో విధమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అంతేకాదు పెళ్లి చూపుల విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు. ఇంతకీ అక్కడ ఎలాంటి ఆచారాలను పాటిస్తారు అంటే..

    దక్షిణ పసిఫిక్ లోని ట్రిబియాండ్ దీవుల్లో ఓ వింత ఆచారం పాటిస్తారట. అక్కడ స్థానిక ప్రాంత దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగల ప్రజలు జీవిస్తున్నారు. తమ పెద్దలు కొన్ని శతబ్దాల కిందట నియమించిన ఆచార వ్యవహారాలను ఇప్పటికీ కూడా వారు తూ.చా తప్పకుండా పాటిస్తున్నారట. మామూలుగా ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పెళ్లి చూపులు జరిగే సమయంలో వధూవరులు ఒకరిని ఒకరు చూసుకోవడం, మట్లాడుకోవడం, ఒకరిని ఒకరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, అభిరుచులు మాట్లాడుకోవడం కూడా చేస్తుంటారు.

    కానీ ఈ ట్రిబియాండ్ దీవుల్లోని ప్రజలు మాత్రం చాలా వింత ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఇక్కడ యువతిని చూడడానికి వెళ్లిన యువకుడా ఆమె ఛాతిని చూస్తాడట. ఆమె ఛాతి గనుక నచ్చకపోతే అక్కడ నుంచి నిర్మోహమాటంగా అక్కడ నుంచి వెళ్లిపోవచ్చట. కేవలం ఛాతి మీద ఆదారపడే అక్కడ పెళ్లిళ్లు జరుగుతాయట. అంటే వీరు పెళ్లికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వారా అంటూ ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. అయితే ఈ వింత ఆచారం గురించి తెలుసుకున్న పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఉంటూ.. ఇలాంటి ఆచారాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.

    పెళ్లి చూపుల్లో అమ్మాయి మొహం, గుణగణాలు తెలుసుకోవాలి కానీ ఈ ఆచారం ఏంటి అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వింత ఆచారాల వల్ల తెగ జాతి మనుగడకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. అందుకు ఇప్పటికి అయినా స్థానిక అధికారులు సరైన చట్టాలు తీసుకోవాలి అని కోరుతున్నారు ప్రజలు.