https://oktelugu.com/

Train Horn: ట్రైన్ లాంగ్ హారన్ వస్తే అర్థం ఏంటో తెలుసా?

రైలు చిన్న సింగిల్ హారన్ సూచిస్తుందంటే.. ఈ ట్రైన్ క్లీనింగ్ కోసం యార్డు లోకి వెళ్తుందని అర్థం.

Written By:
  • Srinivas
  • , Updated On : March 23, 2024 / 02:59 PM IST

    Train Horn

    Follow us on

    Train Horn: భారతదేశంలో రైలు మార్గం చాలా పెద్దది. ట్రైన్స్ లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటాయి. 24 గంటలు తీరిక లేకుండా యాక్టివ్ గా ఉండే రవాణా వ్యవస్థ రైలు మాత్రమే. రైలులో ప్రయాణించడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాకుండా సూదూర ప్రయాణికి చాలా తక్కవ ధరనే చెల్లించవచ్చు. దేశంలో ఎక్కడికైనా రైలు ద్వారా వెళ్లొచ్చు. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు రైల్వే వ్యవస్థకు సంబంధించిన కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అందులో ట్రైన్ హార్న్ గురించి. రైలు హారన్ కనీసం 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు వినిస్తుంది. అయితే రైలు ఎలాంటి హారన్ ఇస్తే అర్థం ఏంటో తెలుసుకోవాలని ఉందా?

    రైల్వేస్టేషన్ కు వెళ్లినప్పుడు ట్రైన్ హార్న్ చాలా భయంగా ఉంటుంది. అయితే ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి రైలుకు ఈ హారన్ సెట్ చేశారు. అంతేకాకుండా ఎంతో దూరం నుంచి స్పీడ్ గా రైలు వస్తుంది. అందువల్ల ముందే దారి ఇవ్వాలనే సూచనతో సూదూరం నుంచే అప్రమత్తం చేస్తారు. అందుకే ట్రైన్ హార్న్ అంత కఠోరంగా సెట్ చేశారు. అంతేకాకుండా రైలు పట్టాలపై ఎలాంటి అటంకాలు లేకుండా రైల్వే సిబ్బందిని అలర్ట్ చేయడానికి కూడా ఈ హారన్ ఉపయోగపడుతుంది. అయితే రైలు హారన్ రకరకాలుగా ఉంటుంది. ఈ హారన్ ను భట్టి రైలు పొజిషన్ ను తెలుసుకోవచ్చు.

    రైలు చిన్న సింగిల్ హారన్ సూచిస్తుందంటే.. ఈ ట్రైన్ క్లీనింగ్ కోసం యార్డు లోకి వెళ్తుందని అర్థం. దీంతో రైలు వెళ్లే దారిలో ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా గార్డ్స్ సరిచూస్తారు. అలాగే షార్ట్ డబుల్ హారన్ ఇస్తున్నారంటే.. ట్రైన్ కదులుతుందని అర్థం. అలాగే చిన్నగా మూడు హారన్లు వస్తున్నాయంటే ఆ ట్రైన్ లోకో ఫైలట్ కంట్రోల్ లో లేదని అర్థం. అలాగే నాలు చిన్నగా హారన్లు వస్తున్నాయంటే ఆ ట్రైన్ లో ఏదో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తంచాలి.

    ఇక ట్రైన్ నుంచి కంటిన్యూస్ గా హారన్ వస్తే.. ఆ ట్రైన్ స్పీడుగా వెళ్తుందని, ఎక్కడా ఆగదని అర్థం. ఈ హారన్ ను ఏదైనా స్టేషన్ వచ్చే ముందు ఇస్తారు. రెండు లాంగ్ హారన్లు ఇచ్చి.. ఒక షార్ట్ హారన్ ఇస్తున్నారంటే.. ఎవరో ప్రయాణికుడు ట్రైన్ చైన్ లాగాడని తెలియజేస్తారు. ఆరుసార్ల చిన్న చిన్నగా హారన్లు వస్తున్నాయంటే ట్రైన్ ప్రమాదకరపరిస్థితుల్లో ఉందని అర్థం. ఇది గ్రహించిన రైల్వే సిబ్బంది ట్రైన్ అవసరాలను తీరుస్తారు. ఇలా ట్రైన్ హారన్ల ను ఒక్కో విధంగా సెట్ చేశారు. ఈ హారన్లను బట్టి రైలు ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవచ్చు.