Engineering and Science Courses : ఐఐటీ.. ఇంటర్ లో మ్యాథ్స్ కోర్స్ చదివే ప్రతీ విద్యార్థి కల. ఐఐటీలో చదవాలని.. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని.. అత్యున్నత స్థాయిలో స్థిరపడాలని చాలామంది విద్యార్థులు అనుకుంటారు. లక్షల మంది విద్యార్థులు పోటీపడితే కొంతమందికి మాత్రమే సీట్లు వస్తాయి. ఐఐటీలో సీట్లు రాని విద్యార్థులు నిరుత్సాహ పడతారు. అలాంటివారు నిరాశ నిస్పృహలకు తావివ్వకుండా.. ఐఐటీ స్థాయిలో విద్యను బోధించి.. అదే స్థాయిలో ఉద్యోగాలు కల్పించే.. విద్యాసంస్థలు మనదేశంలో చాలా ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు సైన్స్ విభాగంలోనూ అత్యున్నత స్థాయిలో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇవి ప్రైవేట్ పరిధిలో ఉన్నాయనుకుంటే పొరపాటే.. వీటిని కూడా కేంద్ర మానవ వనరుల విభాగం నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో విద్యను బోధిస్తున్నాయి. ఇంతకీ ఆ విద్యా సంస్థలు ఏంటంటే..
IISC బెంగళూరు
ఈ విద్యా సంస్థను స్థూలంగా Indian institute of science అని పిలుస్తారు. ఇది బెంగళూరులో ఉంది. కెమికల్, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జువాలజీ విభాగాల్లో ఈ సంస్థ అత్యున్నత కోర్సులను అందిస్తోంది. ఈ విద్యాసంస్థలో ప్రవేశానికి మార్చి నెలలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే నెల వరకు ముగుస్తుంది. ఆ తర్వాత జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుంది.
UGEE
Undergraduate entrance exam.. హైదరాబాద్ త్రిబుల్ ఐటీ లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ ఒకటి నాటికి పూర్తవుతుంది. మే 4న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి సీట్ల కేటాయింపు జరుపుతారు. హైదరాబాద్ పరిధిలో అత్యున్నత స్థాయిలో ఈ విద్యా సంస్థ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. IIIT అంటే international institute of information technology.. ఈ విద్యాసంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇందులో విద్యను అభ్యసించిన వారంతా ఉత్తమ స్థానాల్లో ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ , కంప్యూటర్స్ లో ఈ విద్యాసంస్థ అత్యున్నత స్థాయిలో కోర్సులను అందిస్తోంది.
COMEDK U GET
Consortium of medical, engineering and dental colleges of Karnataka.. కర్ణాటక ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజీలో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇది. ఆ రాష్ట్రంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 5న దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుంది. అనంతరం ప్రవేశ పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
WB JEE
West Bengal joint entrance examination పేరుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తుంది.. ఫిబ్రవరి 5 నాటికి ఈ పరీక్షకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు పూర్తయింది. ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహిస్తుంది.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం అక్కడి ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
MHT CET
Maharashtra cet పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. మార్చి ఐదు నాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తి అవుతుంది. ఏప్రిల్ నెలలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు.