Top Anchors : ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతీ నెలా వివిధ పరిశ్రమలకు చెందిన నటులు, యాంకర్స్ పాపులారిటీ మీద సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో ముగ్గురు బుల్లితెర కమెడియన్స్ టాప్ 5 లో నిలిచారు. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టాప్ 5 తెలుగు టెలివిజన్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ లిస్ట్ విడుదల చేశారు. కాగా జబర్దస్త్ ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది టాప్ 1 స్థానంలో నిలిచాడు. కామెడీ టైమింగ్, స్పాంటేనియస్ పంచులతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు.
ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో హైపర్ ఆది మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక రెండో స్థానంలో బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ నిలిచాడు. సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్. డాన్స్, యాంకరింగ్, మ్యాజిక్ ఇలా పలు ఆర్ట్స్ లో సుధీర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ బుల్లితెర ఆడియన్స్ లో ఆయన క్రేజ్ తగ్గలేదని ఈ సర్వేతో రుజువైంది.
ఇక మరో స్టార్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ టాప్ 3లో ఉన్నాడు. ఇతడు ఆటో పంచులతో ఫేమస్ అయ్యాడు. రాంప్రసాద్, సుధీర్, గెటప్ శ్రీను కాంబినేషన్ లో స్కిట్స్ అదిరిపోయేవి. ఈ ముగ్గురు కలిస్తే నవ్వులే నవ్వులు. ప్రస్తుతం శ్రీను, సుధీర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో రాంప్రసాద్ ఒక్కడే టీం ని లీడ్ చేస్తున్నాడు. జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలు చేస్తున్నాడు. ఇక నాలుగో స్థానం జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ నిలిచింది.
ఈమె సుదీర్ఘ కాలంగా బుల్లితెర పై హవా సాగిస్తుంది. గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది రష్మీ. ఇటు యాంకర్ గా, మరోవైపు నటిగా అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇక ఐదవ స్థానం యాంకర్ ప్రదీప్ దక్కించుకున్నాడు. ఒక మేల్ యాంకర్ గా ఇంతటి పాపులారిటీ సంపాదించడం ప్రదీప్ కి మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం యాంకరింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా ఏ షోలో కూడా ప్రదీప్ కనిపించడం లేదు. అయినా కూడా ప్రదీప్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. స్టార్ యాంకర్స్ గా ఉన్న సుమ కనకాల, శ్రీముఖిలకు టాప్ 5లో చోటు దక్కకపోవడం ఊహించని పరిణామం.
Ormax Characters India Loves: Most popular non-fiction personalities on Telugu television (Feb 2024) #OrmaxCIL pic.twitter.com/5qIPzbzpnn
— Ormax Media (@OrmaxMedia) March 18, 2024