https://oktelugu.com/

Top 10 Greatest ODI Batsmen : టాప్ 10 గ్రేటెస్ట్ ODI బ్యాట్స్ మెన్ వీరే.. వీరి బ్యాక్ గ్రౌండ్.. ఎంట్రీ ఎందరికో స్ఫూర్తి…

అయ దేశాల టీంలకి అత్యద్భుతమైన విజయాలను అందిస్తూ జనాల్లో అత్యధిక ఆదరణను పొందిన ప్లేయర్లు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written By:
  • Gopi
  • , Updated On : October 25, 2023 / 02:11 PM IST
    Follow us on

    Top 10 Greatest ODI Batsmen : ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు టాప్ పొజిషన్ లో ఉన్న చాలామంది క్రికెటర్లని మనం చూసాం కానీ అయ దేశాల టీంలకి అత్యద్భుతమైన విజయాలను అందిస్తూ జనాల్లో అత్యధిక ఆదరణను పొందిన ప్లేయర్లు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… వీళ్లే ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ 10 గ్రేటెస్ట్ ODI బ్యాట్స్ మెన్లుగా ఉన్నారు.వీరి బ్యాక్ గ్రౌండ్.. ఎంట్రీ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. వారి గురించి తెలుసుకుందాం.

    వివి రిచర్డ్సన్
    ఈయన మార్చ్ 7 వ తేదీ న 1952 వ సంవత్సరంలో వెస్టిండీస్ లో జన్మించారు. చాలా సంవత్సరాల పాటు వెస్టిండీస్ క్రికెట్ కి ఎనలేని సేవలు అందిస్తూ తనదైన మార్క్ గుర్తింపును సంపాదించుకుంటూ వెస్టిండీస్ ని తన హయాంలో టాప్ టీమ్ గా నిలిపే ప్రయత్నం చేశాడు …1984 సంవత్సరంలో ఇంగ్లాండ్ పైన ఆయన 189 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఇక ఇది ప్రపంచంలోనే అత్యంత అత్యుత్తమమైన ఇన్నింగ్స్ గా అప్పట్లో చరిత్రలో నిలిచింది…ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ప్లేయర్ గా కూడా నిలిచాడు.కేవలం 21 ఇన్నింగ్స్ లోనే ఈయన 1000 పరుగులను పూర్తి చేసి టాప్ ప్లేయర్ గా నిలిచాడు…ఇక ఈయన 1979 వ సంవత్సరంలో వెస్టిండీస్ ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు అలాగే ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ గా కూడా నిలిచాడు ..

    సచిన్ టెండూల్కర్
    సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24వ తేదీన 1973 వ సంవత్సరంలో జన్మించాడు.ఇండియన్ క్రికెట్ అనే కాదు ప్రపంచ క్రికెట్ కి ఒక దేవుడు గా ఎదిగాడు మొదట 10000 పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ టెండుల్కర్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు.అలాగే ఒక ఇన్నింగ్స్ లో 200 పరుగులు చేసిన ప్లేయర్ గా కూడా చరిత్ర క్రియేట్ చేశాడు…ఇక వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అలాగే అత్యధిక సెంచరీ లు చేసిన ప్లేయర్ గా కూడా సచిన్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఇక సచిన్ వన్డేల్లో 49 సెంచరీ లు చేశాడు…

    Virat Kohli Records

    విరాట్ కోహ్లీ
    విరాట్ కోహ్లీ 1988వ సంవత్సరంలో నవంబర్ 5వ తేదీన జన్మించాడు…కోహ్లీతనదైన మార్క్ ఇన్నింగ్స్ తో ప్రస్తుతం ఇండియన్ టీం కి వరుస విజయాలను అందిస్తున్నాడు…వన్డేలో 48 సెంచరీలు చేసి ఒక సెంచరీ చేస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు…2012 ,2017, 2018 సంవత్సరాల్లో ఏకంగా మూడుసార్లు వన్డే క్రికెట్ లో బెస్ట్ ప్లేయర్ గా ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు…ఫాస్టెస్ట్ 12000 స్కోర్ చేసిన ప్లేయర్ గా కూడా కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు…

    ఎబి డివిలియర్స్
    ఈయన 1984 ఫిబ్రవరి 17వ తేదీన సౌత్ ఆఫ్రికా జన్మించాడు…సౌత్ ఆఫ్రికా టీమ్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ గా తను ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు…ఇక వన్డేల్లో అత్యంత వేగంగా ఒకే ఇన్నింగ్స్ లో ఫాస్టెస్ట్ 50, ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్150 పరుగులు చేసిన ప్లేయర్ గా ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు…50 ప్లస్ యావరేజ్, 100 ప్లస్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన ఒకే ఒక ప్లేయర్ గా నిలిచాడు.

    బ్రియన్ లారా
    మే 2 వ తేదీన 1969 వ సంవత్సరం లో వెస్టిండీస్ లో జన్మించాడు…వెస్టిండీస్ క్రికెట్ టీం లో అద్భుతమైన ప్లేయర్ గా చరిత్రలో నిలిచాడు…వన్డేల్లో పదివేల పరుగులను పూర్తి చేసిన రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.1993 ,1995 వ సంవత్సరం లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు…ఇక టెస్ట్ క్రికెట్ లో అయితే ఒక ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసి ఎవ్వరికి సాధ్యం కానీ విధంగా ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు…

    రికీ పాంటింగ్
    డిసెంబర్ 19 వ తేదీన 1974వ సంవత్సరంలో ఆస్ట్రేలియా లో జన్మించాడు…ఆస్ట్రేలియా టీం తరఫున అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్ గా కూడా ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు.అలాగే ఆ టీం కి రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా కూడా మరొక రికార్డును క్రియేట్ చేశాడు…

    మహేంద్ర సింగ్ ధోని
    ధోని జూలై 7వ తేదీన 1981 వ సంవత్సరంలో రాంచీలో జన్మించాడు.ఇండియన్ టీం తరఫున ది బెస్ట్ కెప్టెన్ గా ధోని తనదైన రికార్డింగ్ క్రియేట్ చేశాడు…ఏ ఇండియన్ కెప్టెన్ కి సాధ్యం కాని విధంగా ఐసీసీ ట్రోఫీలను గెలిచి ఇండియన్ టీమ్ పవర్ ఏంటో ప్రపంచ దేశాలకి చూపించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచాడు…అలాగే టి20 వరల్డ్ కప్ ని, వన్డే వరల్డ్ కప్ ని అందించిన కెప్టెన్ గా కూడా ఆయన మంచి రికార్డుని నమోదు చేసుకున్నాడు…

    రోహిత్ శర్మ
    ఇండియన్ క్రికెట్ హిస్టరీలో రోహిత్ శర్మ తనదైన మార్క్ క్రికెట్ ఆడుతూ మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వస్తున్నాడు…ఇప్పటికే వన్డేల్లో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ గా గుర్తింపు పొందాడు…వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా రోహిత్ శర్మ మంచి రికార్డ్ ని నమోదు చేసుకున్నాడు…

    మైఖేల్ బేవన్
    మే 8వ తేదీన 1970 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జన్మించాడు…ఇప్పటికే 50 యావరేజ్ మైంటైన్ చేస్తూ ఆయనొక హిట్టర్ గా కొనసాగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ప్రపంచ క్రికెట్ వ్యవస్థలోనే ఆయన ఎంత గొప్ప హిట్టర్ అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు…

    డోన్ జోన్స్…
    మార్చి 24 వ తేదీన 1961 వ సంవత్సరంలో ఈయన ఆస్ట్రేలియాలో జన్మించాడు. అద్భుతమైన క్రికెట్ ని ఆడుతూ ఈయన ఆస్ట్రేలియా టీం తరఫున ఘనమైన విజయాలను అందిస్తూ మంచి రికార్డులను కూడా నిలకొల్పాడు…