https://oktelugu.com/

Tomato : కిలో టమాటాల కోసం ఎంత పోరాటం చేశారు తల్లులూ!

వాహన కాలుష్య నియంత్రణపై తమిళనాడులోని పెరంబుర్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సైకిల్ వాడకంపై చైతన్యం తీసుకొచ్చారు. అందులో భాగంగా తంజావూరు బ్యారేజ్ కార్నర్లో ఓ ప్రైవేట్ ట్రస్ట్ తో కలిసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సైకిల్ పై వచ్చే 50 మంది మహిళలకు కిలో టమాటా చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 30, 2023 / 10:41 PM IST
    Follow us on

    Tomato : టమాటా ఈ మధ్య కూరల్లో కంటే వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తోంది. అత్యంత ఖరీదైన కూరగాయగా కిరీటం ధరించిన టమాటాపై ప్రతిరోజూ చిత్ర విచిత్రమైన వార్తలు వెలువడుతున్నాయి. మునుపేన్నడు లేనంతగా టమాటా ధరలు ఒక్కసారిగా 100 నుంచి 200 శాతానికి పెరిగిపోయాయి. అకాల వర్షాలు,తగినంత దిగుబడి లేకపోవడమే టమాటా ధర పెరుగుదలకు కారణం. అటు గృహిణులు సైతం టమాటా లేని వంటలు చేయడం అలవాటు చేసుకుంటున్నారు.ఖరీదైన,అరుదైన వస్తువుగా మారిపోయిన టమాటాను భారీ బహుమానంగా ఎక్కువ మంది భావిస్తున్నారు. పిల్లల పుట్టిన రోజులకు టమాటాలనే బహుమతులుగా ఇస్తున్నారు. చివరకు ప్రభుత్వాలు, యంత్రాంగం సైతం టమాటాలనే ప్రోత్సాహకాలుగా అందిస్తుండడం విశేషం.

    వాహన కాలుష్య నియంత్రణపై తమిళనాడులోని పెరంబుర్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సైకిల్ వాడకంపై చైతన్యం తీసుకొచ్చారు. అందులో భాగంగా తంజావూరు బ్యారేజ్ కార్నర్లో ఓ ప్రైవేట్ ట్రస్ట్ తో కలిసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సైకిల్ పై వచ్చే 50 మంది మహిళలకు కిలో టమాటా చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించారు.

    అయితే ఈ ప్రకటనకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. 50 మంది మహిళలు స్వయంగా సైకిళ్ళు తొక్కుతూ అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం పై అవగాహన కంటే టమాటాలు వస్తాయన్న భావనతోనే ఎక్కువ మంది అక్కడికి రావడం విశేషం.. పాపం వీరింట్లో టమాట వండక ఎన్ని రోజులు అయ్యిందో మరీ… టామాటల కోసం సైకిల్ తొక్కుతూ వచ్చిన మహిళలను అభినందిస్తూ ట్రాఫిక్ విభాగం కమిషనర్ ఎం.జి రామచంద్రన్  కిలో టమాటాలను అందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. కిలో టమాటాలతో ఆనందంతో మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారు. కిలో టమాటల కోసం ఈ మహిళల పోరాటంపై సోషల్ మీడియాలో విభిన్నంగా స్పందిస్తున్నారు. టామాట కోసం ఇంత కష్టపడాలా? అని సెటైర్లు వేస్తున్నారు. టామాట ధరనే ఇంటి ఉపద్రవాలకు కారణం అని తిట్టిపోస్తున్నారు.  ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.