Tollywood Best Female Characters: తెలుగు సినిమాల పై ఎప్పటినుంచో ఒక అపవాదు ఉంది. హీరోయిన్ పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉండదు అని. హీరోయిన్ మహానటి అయినా బాగా నటించడానికి ఆమెకు అవకాశం ఉండదు అని. అయితే.. మీకు తెలుసా ? ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు పవర్ ఫుల్ ఫిమేల్ రోల్స్ ఎక్కువగా ఉన్నది తెలుగు సినిమాల్లోనే.
మరి, తెలుగు తెర పై వెలిగిపోయిన ఆ లేడీ పాత్రలు ఏమిటో తెలుసుకుందాం.
‘ఒసేయ్ రాములమ్మ’ :

లేడీ అమితాబ్ విజయశాంతి ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో ఆమె నటించిన ‘రాములమ్మ’ పాత్ర చాలా పవర్ ఫుల్. అందుకే ఆ పాత్ర చరిత్రలో నిలిచిపోయింది. మొదటి నుంచి చాలా బలహీనమైన మనస్తత్వం కలిగిన ఓ యువతి.. తనకు ఎదురైన దారుణ పరిస్థితులు కారణంగా అత్యున్నత పోరాట విప్లవ నాయకురాలిగా ఎలా ఎదిగింది అనేది ఈ పాత్రలోని ప్రత్యేకత. ఈ పాత్ర నేటికీ బెస్ట్ ఫిమేల్ రోల్ గానే ఉంది.
Also Read: Anjali: వాటిపై మోజు అంటున్న తెలుగు హీరోయిన్
కర్తవ్యం :

విజయశాంతి సినీ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయిన మరో పవర్ ఫుల్ పాత్ర ‘వైజయంతి’. ఈ పాత్రలో ఆమె నటించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఈ పాత్ర పై అభిమానం కలుగుతుంది.
నరసింహ :

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన లేడీ పాత్ర ‘నీలాంబరి’. ఈ నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించింది. సౌత్ ఇండస్ట్రీలోనే ఈ పాత్ర మరపురాని పాత్రగా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. నిజంగానే రమ్య కృష్ణ ఈ పాత్ర లో చాలా రౌద్రం గా కనిపించింది.
అరుంధతి :

అనుష్క నటించిన అరుంధతి సినిమాలో ఆమె చేసిన ‘అరుంధతి’ పాత్ర కూడా మరో పవర్ ఫుల్ రోల్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అయిన ఈ చిత్రం, కేవలం అరుంధతి పాత్ర వల్ల భారీ వసూళ్లు సాధించడం విశేషం.
భాగమతి :

అనుష్క మెయిన్ లీడ్ గా వచ్చిన భాగమతి సినిమాలో.. భాగమతి పాత్ర కూడా మరో స్పెషల్ రోల్ గా నిలిచిపోయింది. “భగ .. భగ … భగ .. భగ .. భాగమతి” అంటూ ఈ పాత్ర క్రియేట్ చేసిన సంచనాలు సామాన్యమైనవి కావు.
ఎటో వెళ్ళిపోయింది మనసు :

‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాలో సమంత పోషించిన నిత్య పాత్ర కూడా ప్రత్యేకమైనది. ఇద్దరి ప్రేమికుల చిన్ననాటి జీవితం నుంచి పెళ్లి వరకు వారి మధ్య జరిగే ప్రయాణాన్ని నిత్య పాత్ర ద్వారా చాలా సహజంగా ఎలివేట్ అయ్యింది. అందుకే.. ఈ పాత్ర మనసుకు హత్తుకు పోయింది.
ఆనంద్ :

ఆనంద్ సినిమాలో కమలిని ముఖర్జీ చేసిన రూప పాత్ర కూడా మరో రకమైన పాత్ర. ఈ పాత్రలోని డెప్త్ కారణంగా.. బెస్ట్ ఫిమేల్ రోల్స్ లో సగర్వంగా ఈ పాత్ర తనకంటూ ఓ ప్లేస్ సంపాదించుకుంది. డిజిటల్ జనరేషన్ లో స్వతంత్ర భావాలు కలిగిన ఈ రూప పాత్ర ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేసింది.
గజిని :

గజిని సినిమాలో కల్పన పాత్ర గురించి కూడా ఈ లిస్ట్ లో చెప్పుకోవాలి. కల్పన పాత్రకు ఉన్న జాలి గుణం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. తెలుగు పాత్రల్లోని సహజత్వం సహజమైన మంచితనం కలిగిన పాత్ర ఇది. ఇక ఈ కల్పన పాత్రలో ఆసిన్ అద్భుతంగా నటించింది.
అతడు :

అతడు చిత్రంలో ‘హీరోయిన్ పూరీ’ పాత్ర కూడా ప్రతి తెలుగింటి ఆడపడుచులా అనిపిస్తుంది. చిలిపితనంతో కూడిన ఆ అమాయకమైన పాత్రలో త్రిష చాలా క్యూట్ గా చాలా అందంగా నటించి అలరించింది.
అంతులేని కథ :

అంతులేని కథ అనే సినిమా గురించి ఈ జనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఈ సినిమాలో జయప్రద పాత్ర కూడా హృదయాలను పిండేస్తోంది. తెలుగు తెర పై వచ్చిన ఎమోషనల్ రోల్స్ లో ఇది చాలా బలమైన పాత్ర. ఇలాంటి పాత్రలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే.. తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రలను తక్కువ చేసి చూడలేం.
Also Read:Ranbir- Alia Wedding: ఆలియా పెళ్లి ముహూర్తం ఖరారు.. ముఖ్య అతిధులు వీళ్లే !
[…] […]
[…] Fans Surprised NTR At Mubai: జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ పాత్ర విషయంలో కొన్ని చోట్ల ఫ్యాన్స్ నిరాశ పడినా.. చాలా చోట్ల అభిమానులు ఎన్టీఆర్ నటనకి నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకాలు చేశారు. నిజంగానే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ తన నటనతో అబ్బురపరిచాడు. ఎన్టీఆర్ తో పోటీ పడే నటుడే లేడు అన్నట్టు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ నటన అద్భుతంగా ఉంది. […]
[…] Crazy Multistarrer: ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు. రాజమౌళి పుణ్యమా అని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి నటించి అద్భుతమైన హిట్ ను అందుకున్నారు. అందుకే ఇప్పుడు మిగిలిన స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్స్ వైపే చూస్తున్నారు. క్రేజీ కథలో క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్లు ఉంటే.. నేషనల్ బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతుంది. […]
[…] Victory Venkatesh: వెంకటేష్ – రానా కలయికలో సినిమా వస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి ‘రానా నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. […]