Heroine Protested : సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం హీరోయిన్లను, వర్ధమాన నటులను వాడుకొని వదిలేసే అలవాటు ఎప్పటి నుంచో ఉందని ఒక అపప్రద ఉంది. ఎంతో మందీ నటీమణులు ‘మీటూ’ అంటూ ఈ లైంగిక వేధింపులపై నోరు విప్పుతూనే ఉంటారు. అయితే చిన్న చిన్న దర్శక నిర్మాతలకంటే అదో లెక్క. టాలీవుడ్ నే, కాదు బాలీవుడ్ లోనే ప్రముఖ నిర్మాతకు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుకుగా నడిరోడ్డుపై ఓ నటి నగ్నంగా భైటాయించి నిరసన తెలుపడం సంచలనమైంది. నన్ను వాడుకొని వదిలేశారంటూ ఆమె నిరసన తెలుపడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గీతాఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసుకు వ్యతిరేకంగా కొంతకాలంగా బోయ సునీత అనే మహిళ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపిస్తోంది. ఇదివరకు చాలా సార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. గీతా ఆర్ట్స్ నుంచి కానీ.. బన్నీ వాసు నుంచి కానీ ఎలాంటి హామీ లభించకపోవడంతో తన ఆందోళనను మరింత తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగానే నగ్నంగా భైటాయించి షాకిచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. తనను మానసికంగా హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
నాలుగు సార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆస్పత్రికి వెళ్లివచ్చానని.. బన్నీ వాసు పెడుతున్న టార్చర్ కు తన నరాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈమె మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే ఇలా పలు మార్లు ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలోనూ ఇలానే ఆందోళన చేస్తే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించారు.
ఇక ఈ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. బోయ సునీత ఒంటిపై దుస్తులు కప్పారు. ఆమెను అదుపులోకి తీసుొకని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.
గతంలో నటి శ్రీరెడ్డి కూడా ఇలానే మా ఆఫీస్ ముందర ఆందోళన చేసింది. ఇప్పుడు బన్నీ వాసుపై ఈ మహిళ వరుసగా ఆందోళన చేస్తోంది. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎలాంటి మోసం చేయలేదని.. ఆ మహిళ కావాలనే అభాసుపాలు చేస్తోందని ఇప్పటికే బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. మహిళకు మతి స్థిమితం కోల్పోయిందన్నారు.
https://twitter.com/sairaaj44/status/1593275796218863618?s=20&t=LPs_UM6IF5ndrQ6A1bbfTQ
Recommended Videos: