Tirupati Incident: రాజకీయాల్లోకి ‘శ్రీవారిని’ లాగుతుందెవరు?

Tirupati Incident: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరిన నగరం తిరుపతి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక్కసారైనా తిరుపతికి వచ్చి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవాలని భావిస్తుంటారు. తిరుపతికి వచ్చే భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే బాధ్యతను ఏన్నో ఏళ్లుగా టీటీడీ నిర్వహిస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా టీటీడీ భక్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ హయాంలోనూ టీటీడీ పాలకవర్గం పనితీరుపై విమర్శలు వచ్చాయి. అయితే భక్తులకు దర్శనం, […]

Written By: NARESH, Updated On : April 14, 2022 12:27 pm
Follow us on

Tirupati Incident: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరిన నగరం తిరుపతి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక్కసారైనా తిరుపతికి వచ్చి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకోవాలని భావిస్తుంటారు. తిరుపతికి వచ్చే భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే బాధ్యతను ఏన్నో ఏళ్లుగా టీటీడీ నిర్వహిస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా టీటీడీ భక్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.

టీడీపీ హయాంలోనూ టీటీడీ పాలకవర్గం పనితీరుపై విమర్శలు వచ్చాయి. అయితే భక్తులకు దర్శనం, సౌకర్యాలు కల్పించడంలో మాత్రం టీటీడీ పెద్దగా విఫలం కాలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏర్పడిన టీటీడీ కొత్త పాలకవర్గంపై పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు భక్తుల మనోభవాలను సైతం దెబ్బతీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాలకవర్గం తప్పుడు నిర్ణయాలతో శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారనడానికి తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటే నిదర్శనంగా కన్పిస్తోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి గత రెండ్రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కేవలం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే కొండపైకి టీటీడీ అనుమతించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.

దీంతో భక్తులు టోకెన్ల కోసం క్యూ లైన్లలో బారులుదీరారు.  అయితే భక్తుల సౌకర్యార్థం కనీసం షామియానాలను కూడా ఏర్పాటు చేయపోవడంతో వారంతా ఎండలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. టోకెన్ల కోసం భక్తుల మధ్య తొక్కిలాట జరగడంతో పలువురు భక్తులు గాయపడ్డారు.

ఈ విషయం మీడియాలో రావడంతో టీటీడీ టోకెన్లు లేకుండానే భక్తులను కొండపైకి అనుమతి ఇచ్చింది. దీంతో పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చింది. అయితే తిరుమలలో సామాన్య భక్తుల తొక్కిసలాట, అనంత పరిణమాలపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ప్రస్తుతం పాలకవర్గం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని విమర్శించారు.

గతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలోనూ అందరినీ సమన్వయం చేసుకున్న చరిత్ర టీటీడీకి ఉందన్నారు. మండుటెండలో వేల మంది భక్తులను టోకెన్ల కోసం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. టోకెన్లు ఉన్న వారినే కొండపైకి అనుమతించాలని తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో పాలక మండలి చైర్మన్ ఎప్పుడో ఓ సారి వచ్చి దర్శనం చేసుకునేవారని కానీ ఇప్పుడు ఆయన కొండపైనే తిష్ట వేశారన్నారు. వీఐపీలకు దగ్గరుండి దర్శనం చేపిస్తున్నారన్నారు. ఇక టీటీడీ ఈవో 24 గంటలు పనిచేసినా సమయం సరిపోదని.. అలాంటిది అదనపు బాధ్యతలుగా ఇవ్వడం వారి విజ్ఞతకే వదలేస్తున్నానని అన్నారు. ప్రస్తుత పాలకవర్గం ‘శ్రీవారిని’ రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదన్నారు.