https://oktelugu.com/

Tiger Nageswara Rao Trailer: టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రివ్యూ: రా అండ్ రస్టిక్… రవితేజ విశ్వరూపం!

చాలా కాలంగా టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను వెండితెరపైకి తేవాలని ప్రయత్నం జరుగుతుంది. ఎట్టకేలకు రవితేజ ఆ ఛాన్స్ కొట్టేశాడు. యంగ్ డైరెక్టర్ వంశీ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని తెరకెక్కించాడు.

Written By:
  • Shiva
  • , Updated On : October 3, 2023 / 03:36 PM IST

    Tiger Nageswara Rao

    Follow us on

    Tiger Nageswara Rao Trailer: 70లలో టైగర్ నాగేశ్వరరావు గజ దొంగగా దేశాన్నే హడలెత్తించాడు. అతడు చేసిన దోపిడీలు పోలీసులకు నిద్రలేకుండా చేశాయి. దొంగ అయినా అతడికి జనాల్లో పాపులారిటీ ఉంది. పెద్దలను కొట్టి పేదలకు పంచిన ఇండియన్ రాబిన్ హుడ్ గా టైగర్ నాగేశ్వరరావు పేరుగాంచాడు. ఆంధ్రప్రదేశ్ లో గల కుగ్రామం స్టువర్ట్ పురంలో పుట్టిన నాగేశ్వరరావు దోపిడీలలో ఆరితేరి టైగర్ నాగేశ్వరరావుగా అవతరించాడు. హీరోయిజం పుష్కలంగా ఉన్న సినిమాటిక్ సబ్జెక్టు అతని జీవితం.

    చాలా కాలంగా టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను వెండితెరపైకి తేవాలని ప్రయత్నం జరుగుతుంది. ఎట్టకేలకు రవితేజ ఆ ఛాన్స్ కొట్టేశాడు. యంగ్ డైరెక్టర్ వంశీ టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని తెరకెక్కించాడు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. టైగర్ నాగేశ్వరరావు బాల్యం, అతడు పెరిగిన వాతావరణం, దొంగగా ఎందుకు మారాడు వంటి అంశాలతో పాటు అతడు చేసిన దోపిడీల సమాహారంగా సినిమా తెరకెక్కించారు.

    ఈ దొంగల ముఠాలు ఏరియాలు ఎలా పంచుకునేవి. దొంగతనం చేసి సొమ్ము ఏం చేసేవాళ్ళు వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక టైగర్ నాగేశ్వరావు అంటే పోలీసుల్లో ఉన్న భయం. అప్పుటి వ్యవస్థలను అతడు భయపెట్టిన తీరు చూపించారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ఎక్కడా తగ్గలేదు. ఆసక్తిగొలిపే సన్నివేశాలతో సాగింది. టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ లుక్, డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్. రవితేజ విశ్వరూపం చూపించాడు.

    టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ అంచనాలు పెంచేసింది. దసరా కానుకగా అక్టోబర్ 20న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటిస్తుంది. గాయత్రీ భరద్వాజ్ మరో హీరోయిన్. రేణూ దేశాయ్ కీలక రోల్ తో కమ్ బ్యాక్ ఇస్తుంది. నాజర్, మురళీ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా ఉన్నారు.