Tiger Nageswara Rao Review : టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ఈ సినిమా ని డైరెక్టర్ ఇక్కడ కూడా బోర్ కొట్టకుండా తీయడంలో సక్సెస్ అయ్యాడు అలాగే రవితేజ యాక్టింగ్ కూడా చాలా బాగుంది.

Written By: Gopi, Updated On : October 20, 2023 10:57 am
Follow us on

Tiger Nageswara Rao Movie Review : రవితేజ హీరోగా ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఆయన నటించిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా కూడా మిగిలాయి. ఇంకా ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇవాళ్ల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. నిజానికి ఈ సినిమా స్టువర్టుపురం దొంగగా పేరుగాంచిన నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందింది. అయితే ఈ సినిమా ఏ విధంగా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అలాగే దర్శకుడు ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఈ సినిమా కథలోకి వెళ్తే నాగేశ్వరరావు అనే వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి హాయ్ గా బతుకుతూ ఉంటాడు అలాంటి నాగేశ్వర రావు దొంగ గా మారుతాడు. పోలీసులకు చెప్పి మరి దొంగతనాలు చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు. అందులో భాగంగానే ఈయన దొంగతనాలతో విసిగిపోయిన గవర్నమెంట్ ఆయనని పట్టుకోడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తుంది. నాగేశ్వరరావు ఒక పెద్ద దొంగతనం చేయడానికి ఏర్పాటు చేసుకుంటాడు దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావుని దొంగతనం చేయకుండా ఆపాడా లేదా అనుకున్నట్టుగానే ఆ దొంగ చేశాడా? లేదా అనే కథతో తెరకెక్కిన ఈ సినిమా గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే…

ఈ సినిమా గురించి ఒకసారి బ్రీఫ్ గా అనాలసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం..

డైరెక్టర్ అయిన వంశీకృష్ణ ఇంతకుముందు కిట్టు ఉన్నాడు జాగ్రత్త అలాంటి చిన్న చిన్న సినిమాలు తీస్తూ చెడు ఇప్పుడు ఏకంగా రవితేజ తో ఒక రియల్ స్టోరీ ని తెరకెక్కించే అవకాశం అయితే వచ్చింది. దాంతో ఆయన అవకాశాన్ని వదులుకోవద్దు అనే ఉద్దేశ్యం తో చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా తీసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు.ఈ సినిమా టీజర్ తోనే ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలను రేకెత్తించింది. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా అది ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ నడిచింది. ఇక దీనివల్ల దర్శకుడు తన కెరీర్ లో హిట్ కొట్టాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది అలాగే మురళీ శర్మ నుపుర్ సనన్ అనుపమ కేర్ లాంటి వాళ్ల యాక్టింగ్ చాలా బాగుంది.ముఖ్యంగా రేణు దేశాయ్ పోషించిన పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అనే చెప్పాలి. ఒక మంచి క్యారెక్టర్ ఆమె స్కంద ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు.. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అలాగే ఆయన అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది…

అయితే ఈ సినిమా ని డైరెక్టర్ ఇక్కడ కూడా బోర్ కొట్టకుండా తీయడంలో సక్సెస్ అయ్యాడు అలాగే రవితేజ యాక్టింగ్ కూడా చాలా బాగుంది.కొన్ని సీన్స్ లో అయితే ఈ సినిమా చూసే ఆడియన్స్ కి గూస్ బామ్స్ వచ్చాయనే చెప్పాలి. కొన్ని రాబరీ చేసిన సీన్లని హైలైట్ గా చూపించారు…

నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సినిమా స్టోరీ చాలా లాగ్ అయింది. సాగదీతగా కనిపించింది అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ అసలు బాగాలేదు సాంగ్స్ అసలు మనం వినలేము…

ఇక రవితేజ సినిమాలని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ని ఒకసారి చూడవచ్చు….

సినిమాకి మనం ఇచ్చే రేటు 2.75/5