Tiger Nageswara Rao Biography : మాస్ మహరాజా రవితేజ హీరోగా వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. అయితే ఈ సినిమా కొత్త కాన్సెప్ట్ తోనే వచ్చింది. నిజానికి ఈ సినిమాను రవితేజతోపాటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తీయాలని చూశారు. ముందుగా రవితేజ సినిమా రిలీజ్ అయ్యింది. బెల్లంకొండ మూవీ కూడా మొదలై ఆగిపోయింది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజ పాత్రకు ఓ రియల్ స్టోరీతో అనుబంధం ఉందని తెలుస్తోంది. అయితే ఇదొక రియల్ స్టోరీ అని తెలుస్తోంది. మరి ఓ సారి ఆ స్టోరీ మీకోసం… ఒకప్పటి స్టువర్టుపురంలో ఎంతో మంది పేరు మోసిన దొంగలు ఉండేవారు. అందులో ఒకరు గరిక నాగేశ్వర రావు. ఈయన మీద ఎన్నో కేసులుండేవి. అంతేకాదు అక్కడ జరిగిన ఎన్నో దొంగతనాల్లో ముఖ్య పాత్రధారి కూడా. పెద్ద దొంగల ముఠానే నడిపేవాడు. ఎన్నో సార్లు పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించినా..వారి నుంచి తప్పించుకునేవాడు. కానీ మార్చి 23 1980న రాత్రి ఓ మహిళతో ఉండగా ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఆ మరుసటి రోజు అంటే మార్చి 24న కాల్పుల్లో మరణించాడు.
అయితే ఆయన తండ్రి కూడా దొంగతనాలు చేసేవాడట. అలా వారసత్వంగా వచ్చిందట ఈ దొంగతనం. దీంతో ఎన్నో దొంగతనాలు, దోపీడులు చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోదరుడు ప్రభాకర్ రావు తెలిపాడు. కానీ సంపాదించినదంతా అందరికీ దాన ధర్మాలు చేసేవాడట. ఎవరికి అవసరం ఉంటే వారికి పంచిపెట్టేవాడట. అలా అందరూ కలిసి దొంగతనం చేస్తే నాగేశ్వరరావు మాత్రం అందరికి పంచడంతో.. దొంగతనాలకు ముందు వారు కొన్న రెండు ఎకరాల భూమి తప్ప ఏం మిగలలేదట.
లక్షల్లో దొంగతనాలు చేసినా దాచి పెట్టేది రూపాయి కూడా ఉండేది కాదట. ఇక పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలే సహకరించేవారట. కానీ చివరకు పోలీసులు పట్టుకోవడంతో కాల్పుల్లో చనిపోయారు ఈయన. అంతే కాదు ఈ ఘటన తో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే బనగాపల్లెలో ఓ సారి బ్యాంకును దోపిడీ చేశారట. ఆ బ్యాంకు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. అర్తరాత్రి బ్యాంకు వెనుకవైపు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారట. సేఫ్ ను పగలగొట్టి, దానిని స్మశానవాటికకు తీసుకెళ్లారట.
అందులో 14 కిలోల బంగారం, రూ. 50,000 ఉన్నాయట. అక్కడి నుంచి తెచ్చిన తర్వాత ముఠా సభ్యులమంతా పంచుకోకముందే పోలీసులు వారి గ్రామాన్ని చుట్టుముట్టారని ఆయన సోదరుడు తెలిపారు. అయినా నాగేశ్వరరావు తప్పించుకుంటే తాను లొంగిపోయనని ఆయన సోదరుడు తెలిపారు. అంతే కాదు నాగేశ్వరరావు తప్పించుకోవడానికి ప్రజలు సహకరించారట. దీంతో పోలీసులకు మరింత కోపం వచ్చిందని టాక్. మొత్తంగా దేశాన్ని షేక్ చేసిన నాగేశ్వరరావు స్టోరీ ఇప్పుడు వెండితెరపై షేక్ చేస్తోంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది.