https://oktelugu.com/

Sankranti 2024 Movies: ఈ సంక్రాంతి కి మహేష్ బాబు, తేజ సజ్జా సేఫ్…మరి వెంకటేష్, నాగార్జునలా పరిస్థితి ఏంటి..?

హనుమాన్ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ అది ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కువ కలక్షన్లు రాబడుతుందని అంచనాలు కూడా ఉన్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 12, 2024 / 03:25 PM IST

    Sankranti 2024 Movies

    Follow us on

    Sankranti 2024 Movies: హనుమాన్ గుంటూరు కారం సినిమాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలకు కూడా పబ్లిక్ లో మంచి ఒపీనియన్ అయితే వచ్చింది. రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళుతున్నాయి అయితే ఈ రెండింటిలో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక పెద్ద సినిమా కాబట్టి కలక్షన్స్ పరంగా మహేష్ బాబు సినిమాకి ఎక్కువ కలక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    అలాగే హనుమాన్ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ అది ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కువ కలక్షన్లు రాబడుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంటే రేపు ఎల్లుండి రిలీజ్ అవ్వాల్సిన వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా స్వామి రంగా సినిమాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సక్సెస్ ఫుల్ టాక్ వచ్చింది. కాబట్టి వెంకటేష్ , నాగార్జున సినిమాలు హిట్ తెచ్చుకున్నా కూడా కలక్షన్స్ అనేవి షేరింగ్ లోకి వెళ్లిపోతాయి.

    ఒకవేళ వెంకటేష్, నాగార్జున సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకున్నట్లైతే గుంటూరు కారం హనుమాన్ సినిమాలకి కలక్షన్స్ విపరీతంగా పెరుగుతాయి. అలా కాకుండా ఆ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లైతే షేరింగ్ రూపంలో కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత కూడా ఆన్ని సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. మరి నాలుగు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనేది ఇప్పుడు చెప్పడం కష్టమే కానీ..

    ఇప్పుడు పెద్ద పెద్ద క్రిటిక్స్ సైతం హనుమాన్ సినిమాకి 3 ప్లస్ రేటింగ్ ఇవ్వడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంటూ కలక్షన్స్ ని కూడా భారీగా సంపాదించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ అన్ని సినిమాలని ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరానికి సంభందించిన కార్యక్రమం ఉండడంతో హనుమాన్ సినిమా నార్త్ లో విపరీతమైన కలక్షన్స్ ని రాబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి…