Chiranjeevi: బీజేపీ ‘మెగా’ స్కెచ్‌.. చిరంజీవికి రాజ్యసభ టికెట్ వెనుక అసలు కారణమిదే

టాలీవుడ్‌ పెద్దన్నగా చిరంజీవికి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఏపీలో జనసేనతో కలిసి పనిచేస్తున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పెద్దన్నను పెద్దల సభకు పంపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా బలం పెంచుకోవాలని భావిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : January 30, 2024 12:38 pm
Follow us on

Chiranjeevi: భారతీయ జనతాపార్టీ ఏడాది కాలంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఉత్తర భారత దేశంలో మంచి పట్టు ఉన్న బీజేపీకి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల కారణంగా పట్టు దొరకడం లేదు. ఈ క్రమంలో బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి 50 నుంచి 100 కిపైగా స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో సౌత్‌ఫై ఎక్కువ ఫోక్‌ పెడుతోంది. ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి మంచి స్కోప్‌ ఉన్న తెలుగు రాష్ట్రాలను టార్గెట్‌ చేస్తోంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే సీట్లు ఓట్లు పెంచుకుంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఈసారి 10 లోక్‌సభ సీట్లు ఆశిస్తోంది. ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ గత ఎన్నికల్లో ఖాతా తెరువలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కనీసం 2 నుంచి 5 ఎంపీ స్థానాలు ఆశిస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పట్టు ఉన్న మెగాస్టార్‌ చిరంజీవికి గాలం వేస్తోంది. ఆయన ఇమేజ్‌ను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తోంది. చిరంజీవిని ముందుపెట్టి తెలుగు రాష్ట్రాలతోపాటు సౌత్‌లో పట్టు పెంచుకోవాలని చూస్తోంది.

పెద్దల సభకు సినిమా పెద్దన్న..
టాలీవుడ్‌ పెద్దన్నగా చిరంజీవికి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఏపీలో జనసేనతో కలిసి పనిచేస్తున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పెద్దన్నను పెద్దల సభకు పంపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా బలం పెంచుకోవాలని భావిస్తోంది. మెగాస్టార్‌ను రాజ్యసభకు పంపడంపై ఇప్పటికే బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 6న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం 50 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో పది స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవిని యూపీ నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

ఇప్పటికే అనుభవం..
ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. యూపీఏ–2లో చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ చిరంజీవిని ఓన్‌ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో ప్రధాని పర్యటించిన ప్రతీసారి చిరంజీవిని ఆహ్వానిస్తోంది. తాజాగా పద్మవిభూషణ్‌ కూడా ప్రకటించింది. మరి చిరు బీజేపీ తరఫున మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతారా లేదా అనేది చూడాలి.