https://oktelugu.com/

Venu Swamy : ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య ఉన్న ఈ కుర్రోడు ఓ సెన్సేషన్… ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్!

1994లో విడుదలైన ముగ్గురు మొనగాళ్లు సినిమా నాటికి వేణు స్వామి టీనేజ్ లో ఉన్నాడు. ఆ ఫోటోతో పాటు ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, చంద్రబాబు, కేసీఆర్ వంటి ప్రముఖులతో పూజలు చేయిస్తున్న వేణు స్వామి ఫోటోలతో కూడిన వీడియో వైరల్ అవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2024 / 09:16 AM IST
    Follow us on

    Venu Swamy : సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. సదరు ఫోటోలో ఒక ప్రక్క రమ్యకృష్ణ మరోవైపు నగ్మా ఉండగా మధ్యలో ఓ కుర్రాడు ఉన్నాడు. అతని గెటప్ చూస్తే బ్రాహ్మణుడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ కుర్రాడు నటుడు కాదు. మన అందరికీ తెలిసిన ఒక సెన్సేషనల్ పర్సనాలిటీ. ఇప్పటికే కొందరు గుర్తు పట్టి ఉంటారు. ఆయన ఎవరో కాదు వేణు స్వామి. వివాదాస్పద వ్యాఖ్యలతో వేణు స్వామి అత్యంత పాపులారిటీ సంపాదించాడు. వేణు స్వామి తరచుగా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏమిటో చెబుతూ ఉంటారు.

    కొత్తగా ఓ హీరో లేదా హీరోయిన్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చెబుతాడు. జాతకరీత్యా కొన్ని జంటలు విడిపోవడం ఖాయమని వేణు స్వామి అంచనా వేశాడు. నిజంగానే అది జరిగింది. వేణు స్వామి చెప్పిన కొన్ని మాటలు నిజమయ్యాయి. ఇక వేణు స్వామి అంటే నమ్మకం ఉన్న సెలెబ్రిటీలు ఎందరో ఉన్నారు.

    కెరీర్ లో ఎదిగేందుకు నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. వారి వద్ద వేణు స్వామి లక్షలు ఛార్జ్ చేస్తారు. డబ్బు ఖర్చు అయినా పర్లేదు వేణు స్వామితో పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, అషురెడ్డి ఇలా పలువురు సెలెబ్స్ వేణు స్వామిని గుడ్డిగా ఫాలో అవుతారు.

    కాగా వేణు స్వామికి సినిమా ఇండస్ట్రీతో విడదీయరాని సంబంధం ఉంది. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఆయన స్ట్రాంగ్ అని తెలుస్తుంది. టీనేజ్ నుండే వేణు స్వామి సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ముగ్గురు మొనగాళ్లు మూవీ ప్రారంభోత్సవ వేడుకలో వేణు స్వామి పాల్గొన్నారు. ఆయన పూజలు చేశారు. 1994లో విడుదలైన ముగ్గురు మొనగాళ్లు సినిమా నాటికి వేణు స్వామి టీనేజ్ లో ఉన్నాడు. ఆ ఫోటోతో పాటు ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, చంద్రబాబు, కేసీఆర్ వంటి ప్రముఖులతో పూజలు చేయిస్తున్న వేణు స్వామి ఫోటోలతో కూడిన వీడియో వైరల్ అవుతుంది.