https://oktelugu.com/

Tollywood: ఇండస్ట్రీ లో ఐరన్ లెగ్ లుగా మారిన యంగ్ హీరోలు వీళ్లే…

ఇండస్ట్రీలో ఐరన్ లెగ్గులుగా మారుతున్నారు. ఇక ఫలితం గా ఏ ప్రొడ్యూసర్ గానీ, ఏ దర్శకుడు గానీ వాళ్లతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. వాళ్ళతో సినిమా అంటేనే భయపడిపోయే రేంజ్ లోకి వెళ్ళిపోయారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2023 / 10:33 AM IST

    Tollywood

    Follow us on

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే కొంతమంది హీరోలు మాత్రం సక్సెస్ లు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాంతో వాళ్లు ఇండస్ట్రీలో ఐరన్ లెగ్గులుగా మారుతున్నారు. ఇక ఫలితం గా ఏ ప్రొడ్యూసర్ గానీ, ఏ దర్శకుడు గానీ వాళ్లతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. వాళ్ళతో సినిమా అంటేనే భయపడిపోయే రేంజ్ లోకి వెళ్ళిపోయారు.

    ఇక ముందుగా ఈ లిస్టులో మనం చెప్పుకునే ఐరన్ లెగ్ హీరో రాజ్ తరుణ్…కెరియర్ మొదట్లో వరుసగా మూడు సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకొని ఆ తర్వాత తనకంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతుండడంతో ఆయన మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ఈ క్రమంలో ఈయనతో సినిమా చేయడానికి ఏ దర్శకుడు కూడా ముందుకు రావడం లేదు. అసలు ఆయనకి స్టోరీ చెప్పడానికి కూడా ఏ దర్శకుడు కూడా సాహసం చేయట్లేదు అనే చెప్పాలి. ఇక దీంతో కొత్త డైరెక్టర్లు అతనితో సినిమా చేయాలని కొన్ని కథలు వినిపించినప్పటికీ అవి అంత గా వర్కౌట్ కావడం లేదు. ఎందుకంటే ఆయన్ని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ముందుకు రావడం లేదు. ఇక దాంతో రాజ్ తరుణ్ కెరీర్ అనేది డైలమాలో పడిపోయింది…

    ఆది సాయికుమార్
    ఇక ఈ లిస్టులో మనం చెప్పుకునే మరి హీరో ఆది సాయికుమార్… ఈయన వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు వరుస డిజాస్టర్లు అవడంతో ఆయనతో సినిమా చేయడానికి ఏ ఒక్క డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గానీ సాహసం చేయట్లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన మార్కెట్ అనేది ఎంతవరకు డౌన్ అయిందో ముఖ్యంగా ఈయన చేసిన సినిమాలు యావరేజ్ గా కూడా ఆడటం లేదు డైరెక్ట్ గా డిజాస్టర్లు గా మిగులుతాయి. అందుకే ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు…

    ఇక ఇదే లిస్టులో చేరడానికి రెడీగా ఉన్న మరో హీరో ఎవరు అంటే కిరణ్ ఆభవరం. ఈయన కూడా మొదట్లో ఒకటి రెండు సక్సెస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఆ తరువాత చేసిన చాలా సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో ప్రస్తుతం ఈయన పేరు చెప్తే ప్రొడ్యూసర్లు దర్శకులు వణికి పోతున్నారు…