https://oktelugu.com/

Top Ten 10 OTT Web Series : 2023 లో టాప్ టెన్ 10 ఓటిటి వెబ్ సీరీస్ లు ఇవే…

అన్ని రకాల పాత్రలు పోషించాలి కాబట్టి అందులో భాగంగానే వెంకటేష్ ఈ పాత్రను పోషించాడు అనేది గుర్తించుకొని కనుక ఈ సీరీస్ ని చూస్తే అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు... ఇక ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2023 / 12:50 PM IST
    Follow us on

    Top Ten 10 OTT Web Series : ఈ సంవత్సరం చాలా సినిమాలు చాలా సీరిస్ లు రిలీజ్ అయ్యాయి అయితే సినిమాల విషయం పక్కన పెడితే కొన్ని సిరీస్ లు మాత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ మీద మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే చూసిన ప్రతి ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఎంటర్ టైన్ చేస్తూ చాలా సక్సెస్ ఫుల్ గా సాగిన సిరీస్ ల్లో టాప్ 10 సీరీస్ లు ఏవేవి ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    1.దూత
    నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన దూత సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సిరీస్ లో నాగచైతన్య చాలా కొత్తగా కనిపించడంతో ఈ సీరీస్ లో చేసినందుకు ఆయనకి మంచి పేరు అయితే వచ్చింది. విక్రమ్ కే కుమార్, నాగచైతన్య కాంబినేషన్ లో ఇప్పటికే మనం, థాంక్యూ అనే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో మనం మంచి విజయం సాధించగా థాంక్యూ మాత్రం భారీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఈ సిరీస్ ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది…ఈ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

    2.ఫర్జి
    బాలీవుడ్ హీరో అయిన షాహిద్ కపూర్ తమిళ స్టార్ నటుడు అయిన విజయ్ సేతుపతి మెయిన్ రోల్ లో వచ్చిన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ రావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఎలాగైతే వాళ్ళు సక్సెస్ ని సాధించారో ఇప్పుడు ఈ సిరీస్ తో కూడా చాలా మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఫర్జీ కథ విషయానికి వస్తే తాత స్థాపించిన ఒక పత్రిక కార్యాలయం మూతపడుతుంది దాన్ని ఎలాగైనా సరే ఓపెన్ చేయాలని యువకుడు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడు ఇదే కథతో ఈ సిరీస్ అనేది తెరకెక్కింది… ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది…

    3. రానా నాయుడు
    వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు సీరీస్ కొంచెం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కినప్పటికీ చాలా మంచి సక్సెస్ ని సాధించింది. ముఖ్యంగా వెంకటేష్ లాంటి ఒక ఫ్యామిలీ హీరో ఇలాంటి బోల్డ్ కంటెంట్ లో నటించడం కొంత మంది ఆయన అభిమానులను ఇబ్బంది పెట్టినప్పటికీ నటుడు అంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి కాబట్టి అందులో భాగంగానే వెంకటేష్ ఈ పాత్రను పోషించాడు అనేది గుర్తించుకొని కనుక ఈ సీరీస్ ని చూస్తే అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు… ఇక ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

    4. రియల్ స్టోరీ ది రైల్వే మెన్
    1984వ సంవత్సరంలో గ్యాస్ లీకేజీని ఈ సీరీస్ లో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన సిరీస్ గా కూడా ఇది మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ సిరీస్ నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

    5. కలాపాని
    అండమాన్ నికోబార్ దీవుల్లోని నీరు ఎందువల్ల కలుషితమవుతుంది అనే బేసిక్ పాయింట్ ని తీసుకుని దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో, వాళ్ళు అంగీకరించే రీతిలో తెరకెక్కించి చూపించిన సిరీస్ కాలాపాని… కొత్త కాన్సెప్ట్ లు అంటే ఇష్టపడేవాళ్లు ఈ సిరీస్ ని చూడొచ్చు ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

    6.ది ఫ్రీలాన్సర్
    ఈ సిరీస్ ఐసీస్ వలలో చిక్కుకున్న మహిళని ఒక వ్యక్తి కాపాడడానికి చూస్తాడు. మొత్తానికి ఆ వ్యక్తి ఆ మహిళను కాపాడాడా లేదా అనే ఒక కథాంశంతో క్యూరియాసిటీ ని రేకెత్తించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

    7. సేవ్ ది టైగర్స్
    ఒక ముగ్గురు కపుల్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. నిజానికి ముగ్గురు భర్తలు వాళ్ళ భార్యల చేతుల్లో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు అనే కథాంశంతో తెరకెక్కి చాలా కామెడీగా ఉంటూనే ఇది ఒక మంచి సందేశాత్మకమైన సిరీస్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది…

    8.స్కామ్ 2003 ది తెల్గి స్టోరీ
    2003 వ సంవత్సరంలో స్టాంప్ పేపర్ మోసానికి గురైన అబ్దుల్ కరీం తెలుగు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందే ఈ స్కామ్…ఇది సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

    9 దహాద్
    ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయిన ఒక అమ్మాయి కేసుని సాల్వ్ చేయడమే ఈ సీరీస్ మెయిన్ ప్లాట్…ఇక ఈ సిరీస్ చాలా ట్విస్ట్ లతో కూడుకొని ఉంటుంది… ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

    10.పిప్పా
    ఇషాన్ కట్టర్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్… 1971 వ సంవత్సరంలో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధం లో తన అన్న తమ్ముళ్లతో కలిసి పోరాటం చేసిన కెప్టెన్ బలరాం సింగ్ మెహతా జీవిత కథ ఆధారంగా రూపొందింది…ఈ సిరీస్ చాలా కొత్తగా ఉండటమే కాకుండా చూసిన ప్రతి ప్రేక్షకుడిని కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…