Team India : ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ లో ఓడిపోవడం ఎవరిని ఎంత బాధిస్తుందో తెలియదు గానీ, సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ లాంటి వాళ్లని మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఆడేది ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అందువల్లే దీన్ని సక్సెస్ తో ముగిద్దాం అని అనుకున్నప్పటికీ అది వీలు కాలేదు…
ఎందుకంటే ఇప్పటికే వాళ్లకు ఏజ్ అనేది భారీగా పెరిగిపోవడంతో నాలుగు సంవత్సరాల వరకు ఇండియన్ టీం లో ఉంటారా లేదా అనేది చర్చనీయాంశం గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఫిట్ గా ఉన్నారు. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ వాళ్ళలో కన్ఫీడెన్స్ లెవెల్ తగ్గిపోయి ఫామ్ ని కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఒక్కొక్క సీనియర్ ప్లేయర్ ఏజ్ ఎంత ఉందనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆయన అంత ఫిట్ గా ఉన్నట్టు ఎప్పుడు కనిపించలేదు. 36 ఏళ్ల రోహిత్ ఇప్పటికే ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే తను ఎక్కువ మ్యాచ్‌లూ ఆడటం లేదు. అలాంటిది 2027 వరల్డ్ కప్ సమయానికి రోహిత్ కి 40 సంవత్సరాల వయసులో వస్తుంది. కాబట్టి అప్పుడు ఆయన ప్రపంచకప్ ఆడటం కష్టమే…
ఇక ఇండియన్ పేస్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ కూడా మరో వరల్డ్ కప్ వరకు ఇండియన్ టీమ్ లో కొనసాగే అవకాశాలు అయితే చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకనే ఇప్పటికే 33 ఏళ్ల వయసు ఉన్న షమీ మరో ప్రపంచకప్ వరకు 37 ఏళ్ల వయసు కు వస్తాడు దాంతో ఆయన క్రికెట్ కి గుడ్‌బై చెప్పడం పక్క…ఇక ప్రస్తుతం జోరుమీదున్న కూడా అప్పటి వరకు ఇదే ఫామ్ కంటిన్యూ చేయలేడు కాబట్టి జట్టులో కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్టే…ఇక ఇండియన్ స్పిన్ దిగ్గజం అయిన రవించంద్రన్ అశ్విన్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఇండియన్ టీమ్ కి ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్నాడు..ఇక ఇప్పటికే 37 ఏళ్ల వయస్సు ఉన్న అశ్విన్ నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ వరకు టీమ్ లో ఉండటం చాలా కష్టం…
ఇక రవీంద్ర జడేజా ప్రస్తుతం 34 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు కాబట్టి ఈయనకి కూడా ఇదే లాస్ట్ వరల్డ్ కప్ కానుందని తెలుస్తుంది… ఇక ప్రస్తుతం 35 ఏళ్ల వయసు ఉన్న కోహ్లీ 2027 వరల్డ్ కప్ సమయానికి 39 సంవత్సరాలు వచ్చిన కూడా ఇంతే ఫిట్‌నెస్‌తో ఉండి ఆట లో అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచినట్టైతే కోహ్లి ఆటలో కొనసాగే అవకాశాలను ఉన్నాయి కానీ తను ఏ మేరకు ఫామ్ లో ఉంటాడు అనేది తెలియాల్సి ఉంది…
ఇక మొత్తానికి 2023 వరల్డ్ కప్ లో రన్నరప్ గా మిగిలాము ఎన్నో ఆశలు ఎన్నో విజయాల తర్వాత రన్నరప్ గా మిగిలి పోయాము…ఇక ఆట లో గెలుపు, ఓటములు సహజం ఇక వరల్డ్ కప్ గురించి అందరూ మర్చిపోయి నెక్స్ట్ ఏం చేస్తే మరోసారి కైన మనం కప్పు కొట్టగలం అనే దానిమీద దృష్టి పెడితే బాగుంటుంది…