https://oktelugu.com/

Secrets of Mahatma Gandhi : మహాత్మాగాంధీ గురించి మీకు ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్ ఇవీ..

1948లో జనవరి 30న గాంధీజీపై మూడుసార్లు కాల్పులు గాడ్సే జరపడంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు దాదాపు 20 లక్షల మంది జనం హాజరయ్యారు. ఇప్పటి వరకు ఏ నాయకుడికి ఇంత జనం రాలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2023 / 10:12 AM IST
    Follow us on

    Secrets of Mahatma Gandhi : భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుల్లో ప్రధాన వ్యక్తి మహాత్మ గాంధీ. మోహన్ దాస్ కరం చంద్ అయిన గాంధీ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు ఇలా శాంతియుతంగా ఎన్నో పోరాట కార్యక్రమాల్లో పాల్గోన్న బాపూజీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు పట్టు వీడలేదు. మహాత్మ గాంధీ తన జీవితంలో ఎక్కువ భాగం స్వాతంత్ర్య పోరాటమే కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతీ సంవత్సరం గాంధీజీని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించారు. గాంధీజీ జయంతి సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకోసం..

    బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాండించిన గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన దీక్ష గురించి ప్రజలకు తెలియకుండా బ్రిటీష్ ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంది. ఈ దీక్షకు సంబంధించి ఫొటోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంది.అందుకే గాంధీజీ నిరాహార దీక్ష ఫొటోలు ఇప్పటికీ కనిపించవు.

    78 ఏళ్ల పాటు మహాత్మగాంధీ యాక్టివ్ గా కనిపించేవారు. ఇందుకు కారణం ఆయన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే. దాదాపు 5 సంవత్సరాల పాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తీసుకునేవారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు దరిచేరడంతో వీటిని దూరం పెట్టారు. ఆహార విషయంలో గాంధీజీ వివిధ ప్రయోగాలు చేసేవారు.

    మహాత్మ గాంధీ స్వాతంత్ర్య ఉద్యమానికి ముందే మహిళల హక్కుల కోసం పోరాడారు. నీలిమందు రైతుల తరుపున కూడా పోరాటం చేశారు. ఆ సమయంలో గాంధీని మహాత్మ అని పిలిచేవారు.

    గాంధీజీకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కస్తూర్బాను పెళ్లి చేసుకున్నారు. గాంధీజీ కంటే ఆమె ఏడాది వయసు పెద్ద. వీరు 62 ఏళ్ల పాటు అన్యోన్యంగా జీవించారు.

    గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత మొదటిసారి చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

    గాంధీజీ ఎక్కువగా మేకపాలు తాగేవారు. కొన్ని సందర్భాల్లో ఆయన వెంట ఈ పాలను తీసుకొని వెళ్లేవారు.

    కస్తూర్బా 1944లో అగాఖాన్ ప్యాలెస్ లో నిర్బంధంలో ఉండగానే మరణించారు. ఆమె మరణించిన తేదీని (ఫిబ్రవరి 22)ను మదర్స్ డే ను నిర్వహించుకుంటున్నారు.

    1948లో జనవరి 30న గాంధీజీపై మూడుసార్లు కాల్పులు గాడ్సే జరపడంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు దాదాపు 20 లక్షల మంది జనం హాజరయ్యారు. ఇప్పటి వరకు ఏ నాయకుడికి ఇంత జనం రాలేదు.