https://oktelugu.com/

Cricket : క్రికెట్లో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు గెలిపించిన ఆటగాళ్లు వీరే..

టీమిండియా కు వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా ధోనీ పేరిట రికార్డు ఉంది. కీలకమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఎన్నోసార్లు ధోని గెలిపించాడు. అలా అంతర్జాతీయ క్రికెట్లో ఇండియా జట్టు సాధించిన 298 విజయాలలో ధోని కీలకపాత్ర పోషించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 / 12:06 PM IST

    These are the players who have won the most international matches in cricket.

    Follow us on

    Cricket : ఆట ఏదైనా సరే.. ఎలా ఆడినా సరే.. విజయానికే ప్రాధాన్యం ఉంటుంది. విజయం సాధించిన వారికే గౌరవం ఉంటుంది. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని చాలా మంది చెబుతుంటారు కానీ.. ఆ ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేరు. మిగతా ఆటల్లో ఏమో గాని.. క్రికెట్లో విజయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.. అలా విజయాలు సాధించిన జట్లకే అన్ని రకాలుగా ఆదాయం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ పై బీసీసీఐ పెత్తనం చెలాయిస్తోంది అంటే దానికి కారణం అదే. ఆ విషయం పక్కన పెడితే ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ ల్లో విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

    రికీ పాంటింగ్

    ఆస్ట్రేలియా జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్. ఏకంగా రెండుసార్లు ఆ దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ అందించాడు.. రైట్ హ్యాండ్ బ్యాటర్ గా ఎన్నో సెంచరీలు సాధించాడు.. సచిన్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మొన్నటిదాకా కొనసాగాడు. ఆస్ట్రేలియాకు ఏకంగా 377 అంతర్జాతీయ మ్యాచుల్లో విజయాలు అందించాడు.

    మహేళ జయవర్ధనే

    శ్రీలంక కెప్టెన్ గా జయవర్ధనే అద్భుతమైన విజయాలు అందించాడు. కీలకమైన టోర్నీల్లో రాణించి శ్రీలంక జట్టుకు కప్ లు దక్కేలా చేశాడు. జయవర్ధనే శ్రీలంక జట్టుకు 336 అంతర్జాతీయ మ్యాచ్ విజయాలు అందించాడు.

    విరాట్ కోహ్లీ

    టీమిండియా రన్ మిషన్ గా పేరుపొందిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లపై భారత జట్టు చిరస్మరణ విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.. భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో ఏకంగా 313 విజయాలు అందించాడు.

    సచిన్ టెండుల్కర్

    క్రికెట్ గాడ్ గా, అటు టెస్ట్, ఇటు వన్డేల్లో ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ అతని రికార్డ్ ఎవరూ అధిగమించలేకపోతున్నారు. సచిన్ కు దరిదాపుల్లో విరాట్ ఉన్నాడు.. 307 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారత జట్టుకు విజయాలు అందించాడు.

    జాక్వెస్ కల్లీస్

    సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ గా జాక్వెస్ కల్లీస్ పేరు గడించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో తిరుగులేని రికార్డుల సృష్టించాడు. సౌత్ ఆఫ్రికా జట్టు 305 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో విజయం సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు.

    కుమార సంగక్కర

    వికెట్ కీపర్ గా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా కుమార సంగక్కరకు తిరుగులేని రికార్డు ఉంది. శ్రీలంక జట్టుకు అతడు ఎన్నో విజయాలు అందించాడు. 305 అంతర్జాతీయ మ్యాచ్లలో శ్రీలంక జట్టు విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు.

    రోహిత్ శర్మ

    హిట్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ.. ఇండియా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో 299 మ్యాచ్లలో ఇండియా విజయం సాధించేందుకు కృషి చేశాడు.

    మహేంద్ర సింగ్ ధోని

    టీమిండియా కు వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా ధోనీ పేరిట రికార్డు ఉంది. కీలకమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఎన్నోసార్లు ధోని గెలిపించాడు. అలా అంతర్జాతీయ క్రికెట్లో ఇండియా జట్టు సాధించిన 298 విజయాలలో ధోని కీలకపాత్ర పోషించాడు.