AP BJP MP candidates : ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. ఆ నేతలకు షాక్

అయితే జాబితాలో సీనియర్లకు చోటు దక్కలేదు. జివిఎల్ నరసింహరావు, పివిఎన్ మాధవ్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ఎంపీ టికెట్లను ఆశించారు. కానీ బిజెపిలోని ప్రో టిడిపి నేతలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా బిజెపికి టిడిపి దగ్గరయ్యేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ నేతలంతా అప్పట్లో అడ్డుకున్నారు.

Written By: Dharma, Updated On : March 25, 2024 8:52 am

These are the AP BJP MP candidates

Follow us on

AP BJP MP candidates : ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు బిజెపి హై కమాండ్ ఐదో జాబితాను విడుదల చేసింది. అందులో ఏపీకి స్థానం దక్కింది. అక్షరమాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని ఆరుగురు అభ్యర్థులు చోటు దక్కించుకున్నారు. పొత్తులో భాగంగా బిజెపికి పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు జాబితాలను బిజెపి ప్రకటించింది. కానీ అభ్యర్థుల ఖరారు కొలిక్కి రాకపోవడంతో నాలుగు జాబితాల్లో ఛాన్స్ దక్కలేదు. నిన్న పొద్దు పోయాక బిజెపి హై కమాండ్ ఐదో జాబితాను రిలీజ్ చేసింది. ఏపీలో పొత్తులో భాగంగా దక్కిన ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం విశేషం.

అయితే గతంలో ఊహించిన పేర్లే దాదాపు ఖరారయ్యాయి. ఐదో జాబితాలో తొలి పేరు అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న అరకు గతంలో ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె పేరును బిజెపి ఖరారు చేసింది.అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ల పేర్లను బిజెపి ప్రకటించింది. లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో.. ఈరోజు సాయంత్రానికి శాసనసభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే జాబితాలో సీనియర్లకు చోటు దక్కలేదు. జివిఎల్ నరసింహరావు, పివిఎన్ మాధవ్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు ఎంపీ టికెట్లను ఆశించారు. కానీ బిజెపిలోని ప్రో టిడిపి నేతలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా బిజెపికి టిడిపి దగ్గరయ్యేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ నేతలంతా అప్పట్లో అడ్డుకున్నారు. చివరకు పొత్తు కుదరకూడదని ఆశించారు. కానీ పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో ఈ నేతలందరికీ టిక్కెట్ల విషయంలో మొండి చేయి ఎదురవుతోంది. అయితే అసెంబ్లీ సీట్లలోనైనా తమను సర్దుబాటు చేస్తారని మీరు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.