https://oktelugu.com/

Tirumala : తిరుపతి వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే ఇది ఒకసారి చదవండి..

నార్మల్ హోట్లల్లు, లగ్జరీ హోటల్లు, ఫైవ్ స్టార్ హోటల్లు, దర్శనమిస్తూనే ఉంటాయి. బడ్జెట్ కి తగ్గట్టుగా హోటల్ ను బుక్ చేసుకోవడం మంచిది. గుడికి దగ్గరలోనే చాలా అతిథి గృహాలు ఉంటాయి. ఇక తిరుచానూరు పట్టణంలోని చిరుచానూరులో ఉండడానికి ప్రయాణికులకు చాలా పేరు గాంచిన ప్రాంతం. ఆలయానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2024 / 08:23 AM IST

    Tirupati

    Follow us on

    Tirumala : ఆంధ్రులకే కాదు భారతదేశంలోని సకల జనులకు ఆరాధ్య దైవంగా వెలసి ఉత్తరాది వారికి బాలాజిగానూ, దక్షిణాది వారికి శ్రీ వెంకటేశ్వర స్వామిగానూ కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు తిరిమలేశుడు. కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీ నాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం తిరుపతి. అయితే ఇక్కడికి వెళ్లాలనీ ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోవాలని యావత్ ప్రపంచం అనుకుంటుంది. అమెరికా, ఉత్తరాఖండ్ ఇలా నలు మూలల నుంచి భక్తులు ఉన్నారు ఆ స్వామికి. అయితే ఇక్కడికి ఎలా వెళ్లాలి. తిరుమల తిరుపతి విశేషాలేంటి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం…

    భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుపతి. అత్యంత గౌరవనీయమైన హిందూ దేవతలలో ఒకరు వెంకటేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుతారు. ఆ భగవంతుని ఆశీర్వాదం కోసం గంటలు లైన్ లో వేచి ఉంటారు. తిరుపతి బాలాజీ విశ్వాసానికి, భక్తికి, అంకితభావానికి ప్రతీక. బాలాజీని సందర్శించడం ఒక మంచి అనుభవం. అయితే ఇక్కడికి వెళ్లడానికి రోడ్డు, వాయు, రైల్వే మార్గాలు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకుందాం..

    బస్సు ద్వారా: తిరుపతికి చాలా బస్సు సౌకర్యాలు కలవు. ఆన్ లైన్ బుక్ చేసుకుంటే ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం మీదుగా అక్కడికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో తిరుపతి సిటీ సెంటర్ నుంచి బస్సు లేదా టాక్సీ తీసుకొని వెళ్లచ్చు. లేదా నడిచి కూడా వెళ్లచ్చు. ఖాళీ నడకన వెళ్లాలి అనుకునేవాళ్లు మెట్ల ద్వారా వెళ్లవచ్చు. లేదా బస్సు ప్రయాణంతో వెళ్లవచ్చు.

    విమానం అయితే…
    తిరుపతికి దగ్గరలో చైన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి ఆలయానికి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారులో అయితే మూడు గంటల్లో చేరుకోవచ్చు. చెన్నై నుంచి రైలు కూడా ఉంది అక్కడి నుంచి అయినా చేరుకోవచ్చు.

    రైలు ద్వారా..
    సికింద్రబాద్ నుంచి తిరుపతికి చాలా ట్రైన్ లు ఉంటాయి. వాటి ద్వారా తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవాలి. టికెట్లను ఆన్ లైన్ లో లేదా రైల్వే స్టేషన్ లో బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ప్రైవేట్ వెహికిల్స్ బస్సు ద్వారా వెళ్లవచ్చు.

    వెళ్లడానికి అనువైన సమయం?
    అయితే తిరుపతి వెళ్లేటప్పుడు వాతావరణాన్ని దృష్టిల్లో పెట్టుకొని వెళ్లడం ఉత్తమం. ఈ ఆలయం దక్షిణ భారతంలో ఉంది కాబట్టి.. వేడి, తేమ వంటి వాతావరణం గురించి ఆలోచించాలి. అయితే ఉష్ణోగ్రతల పరంగా చూస్తే తిరుపతికి అక్టోబర్ మార్చి మధ్య వెళ్లాలని చెబుతుంటారు. ఈ నెలల్లో భక్తుల రద్దీ చాలా ఉంటుంది. ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. కాబట్టి ముందుగానే హోటల్ ల ను బుక్ చేసుకోవడం మంచిది.

    చూడవలసిని ప్రదేశాలు
    శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయం నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఎడమ వైపున పెద్దమ్మ గుడి ఉంటుంది. ఆ చుట్టుపక్కలనే కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామీ పెద్ద విగ్రహం ఉంటుంది. ఒకప్పుడు రాజుకృష్ణదేవరాయల ఆశ్రయం కోసం తులసి వన ఉద్యానవనాన్ని నిర్మించారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కళ్యాణ మండపానికి వెనుక ఉంటుంది.

    ఎక్కడ బస చేయాలి?
    నార్మల్ హోట్లల్లు, లగ్జరీ హోటల్లు, ఫైవ్ స్టార్ హోటల్లు, దర్శనమిస్తూనే ఉంటాయి. బడ్జెట్ కి తగ్గట్టుగా హోటల్ ను బుక్ చేసుకోవడం మంచిది. గుడికి దగ్గరలోనే చాలా అతిథి గృహాలు ఉంటాయి. ఇక తిరుచానూరు పట్టణంలోని చిరుచానూరులో ఉండడానికి ప్రయాణికులకు చాలా పేరు గాంచిన ప్రాంతం. ఆలయానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.