Animals Fasting: మనుషులకు బాగా లేనప్పుడు విశ్రాంతి తీసుకోవడం, డాక్టర్ని సంప్రదించడం, టాబ్లెట్స్ వేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎప్పటినుంచో మన పూర్వీకులు బాగా లేనప్పుడు ఉపవాసం ఉంటే అన్ని రకాల మంచిది అని చెబుతూ వచ్చారు. లంకణం పరమ ఔషధం అన్న సామెత కూడా ఉండనే ఉంది…అయితే మనలో దీన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ అనుకోండి.. కానీ నోరు లేదు ,తెలివి లేదు అని మనం భావించే జంతువులు ఆరోగ్యం బాగా లేనప్పుడు పూర్తిగా ఉపవాసం ఉంటాయి.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. జంతువులకు ఆరోగ్యం బాగా లేనప్పుడు అవి తమ చుట్టుపక్కల లభించే కొన్ని ఔషధ భరితమైన మొక్కలను సేవిస్తాయి. అలాగే కొన్ని సందర్భాలలో ఉపవాసం కూడా ఉంటాయి. మరి ఆ జంతువులు ఏవి ,ఎటువంటి పరిస్థితుల్లో అవి ఉపవాసం ఉంటాయో తెలుసుకుందామా..
గజరాజులు.. తీవ్రంగా గాయపడిన సమయాలలో గాయం మానేంతవరకు పస్తులు ఉంటాయి. అలా ఉండడం వల్ల వాటి శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుందో ఏమో…గాయం త్వరగా నయం అవుతుంది. ఇక పెంపుడు జంతువులుగా చాలా వరకు ఇళ్లల్లో కనిపించే కుక్కలు కూడా తాము గాయపడినప్పుడు కోలుకునే వరకు ఉపవాసం చేస్తాయి.
గుర్రాలు కాస్త అనారోగ్యం పాలైతే చాలు ఆకలి కోల్పోతాయి. అవి తిరిగి ఆరోగ్యంగా మారేంతవరకు ఆహారాన్ని ముట్టవు. ఎలుగు గంటలు కూడా అంతే శీతాకాలం వచ్చిందంటే చాలు గంటలకొద్దీ నిద్రపోతాయి.. ఈ ఫైబర్ నేషన్ సమయంలో అవి అస్సలు ఆహారం ముట్టుకోవు. నిద్రకు ఉపక్రమించడానికి ముందే కావలసినంత ఆహారాన్ని భుజించి కొవ్వు రూపంలో వాటిని శరీరంలో భద్రపరచుకుంటాయి. ఇక ముసల్లు వేసవికాలంలో చాలా తక్కువ ఆహారం తీసుకుంటాయి.
పాములు కూడా వేటాడి బాగా కడుపునిండా తిన్న తర్వాత తినింది అరిగేంతవరకు ఉపవాసం చేస్తాయి. ఇక మంచు ప్రాంతాలలో ఎక్కువగా ఉండే పెంగ్విన్లు తమ స్పందన మెరుగుపరచడం కోసం ఉపవాసం చేస్తాయట. నీళ్లలో ఎక్కువగా తిరిగే సీల్స్ కూడా తమ స్వాము మరియు గుడ్డు నాణ్యత మెరుగుపరిచి ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మ ఇవ్వడం కోసం ఉపవాసం చేస్తాయట. జంతువులు ఆహారం దొరక్క లేక ఆరోగ్యం కోసం తిండి తినకుండా ఉంటుంటే… మనం మాత్రం అనారోగ్యకరమైన భోజనం చేసి ,ఆరోగ్యం పాడు చేసుకుని తిరిగి మళ్లీ ఆరోగ్యంగా ఉండడం కోసం డైట్ల పేరుతో ఉపవాసం చేస్తున్నాం. చూడండి మరి జంతువుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో…