TTD : తిరుమల వెంకన్న దర్శనానికి ప్రవాస భారతీయుల ఇక్కట్లు తెలుసుకుందామా?

తిరుమల వెంకన్న దర్శనానికి ప్రవాస భారతీయుల ఇక్కట్లపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 25, 2023 3:15 pm

TTD : పవిత్రమైన తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ప్రతీ సంవత్సరం లక్షలాది మంది ఎన్నారైలు తిరుమల వస్తుంటారు. కారణం ఇక్కడి మూలాలు ఉన్నవారు.. దూరాన ఎక్కడ ఉన్న వారు సైతం ఒక్కసారైనా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలన్న తపనతో   వస్తుంటారు. ఎన్నారైలకు ప్రత్యేక సౌకర్యాలంటూ ఆర్భాటంగా టీటీడీ ప్రకటనలు ఇస్తున్న ఆచరణలో సాధ్యం కావడం లేదు.

ఎన్నారైలకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తామని.. వారికి ఈజీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చెబుతున్నా అదంతా వట్టి మాటలుగానే మిగిలిపోతోంది. టీటీడీ చర్యలు ఎంత వరకూ నిజం అన్నది తెలుసుకుందాం.

ఎన్నారైలు టీటీడీని నమ్మి ఎంతో ఎక్స్ ప్టేకేషన్స్ తో తిరుమల వస్తుంటారు. తమను గుర్తించి టీటీడీ ఆహ్వానిస్తోందని ప్రవాసులు నమ్మకంతో వస్తారు. కాటేజీలు, ట్రాన్స్ పోర్ట్ లతో వీరు డబ్బులు చెల్లించి ఉండగలరు. కానీ దర్శనానికి మాత్రం ఎన్నారైలు బాగా ఇబ్బంది పడుతున్నారు.

కౌంటర్లలో ఎన్నారైలు అన్న పేరు చూసి క్యూలో ఈజీగా వెళతారు. కొంతదూరం వెళ్లాక అక్కడ ఎన్ కౌంటర్ అక్కడ జరుగుతుంది. ఫార్మాలటీస్ పేరిట క్యూలో ఫాం ఫిలప్ చేయమంటారు. అక్కడ 100 మంది గుమిగూడుతారు. పిల్లలు ఉన్న వాళ్లు ఏం చేయాలి? వారి ఇబ్బందులు వర్ణణానీతం..

తిరుమల వెంకన్న దర్శనానికి ప్రవాస భారతీయుల ఇక్కట్లపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.