https://oktelugu.com/

Ram Charan – Allu Arjun : రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య విబేధాలు లేవు అనడానికి ఇదొక్కటి చాలు…

దానితో ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు అల్లు ఆర్మీ కూడా తమదైన రీతిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వీళ్లంతా కలిసి ఉంటేనే బాగుంటుంది అంటూ మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2023 / 09:46 AM IST
    Follow us on

    Ram Charan and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఒక అరడజన్ హీరోలు ఉన్నారు అయితే ఈ హీరోలందరి సినిమాలు కూడా ప్రతి సంవత్సరం థియేటర్ లోకి వచ్చి మంచి సందడి చేస్తూ ఉంటాయి.ఇక ఇలాంటి క్రమంలోనే కొన్నిసార్లు మెగా హీరోల మధ్య మాటలు లేవు అంటూ కొన్ని కామెంట్లు కూడా తరచుగా వినిపిస్తూ ఉంటాయి. కానీ మెగా ఫ్యామిలీ వాటన్నింటికీ చెక్ పెడుతూ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు అన్నట్టుగా ఎప్పటికప్పుడు అభిమానుల ముందు నిరూపిస్తూ వస్తుంటారు.

    ఇక ఇదే క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య కొద్దిరోజులుగా మాటలు లేవు అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. కానీ కొన్ని రోజులు గా అల్లు అర్జున్, రామ్ చరణ్ లకి కొన్ని రోజుల నుంచి మాటలు లేవు అంటూ కొన్ని. కామెంట్లు చేస్తున్నారు.అయితే ఆర్ ఆర్ అర్ సినిమా విషయంలో ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు గానీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించినప్పుడు గాని అల్లు అర్జున్ ప్రత్యేకంగా రామ్ చరణ్ కి కృతజ్ఞతలు అంటూ ఏ విధమైన ట్వీట్ గాని, మాటలు గాని ఎక్కడ చెప్పలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాని ఉద్దేశిస్తూ మాత్రమే మాట్లాడాడు. అలాగే ఇది జరిగిన కొద్దిరోజులకు పుష్ప సినిమాకు గానీ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది.ఆ సందర్భంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.

    తను కూడా పుష్ప సినిమా గురించి మాత్రమే మాట్లాడాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా పెరిగింది అంటూ ఇద్దరి అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు.కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ నిర్వహించిన పండుగ సెలబ్రేషన్స్ కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇక అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు పక్క పక్కన నుంచొని ఫోటోలు దిగడం అనేది వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పడానికి మరొకసారి క్లారిటీ ఇచ్చినట్టుగా అభిమానులు భావిస్తున్నారు.

    దానితో ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు అల్లు ఆర్మీ కూడా తమదైన రీతిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వీళ్లంతా కలిసి ఉంటేనే బాగుంటుంది అంటూ మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు…