https://oktelugu.com/

Sankranti 2024 Movies: సంక్రాంతి రేస్ లో 5 సినిమాలు…వెనక్కి తగ్గే సమస్యే లేదు అంటున్న హీరోలు…

ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా మూడు సంవత్సరాల నుంచి తెరకెక్కుతూనే ఉంది కాబట్టి ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆ చిత్ర యూనిట్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : December 20, 2023 / 08:37 AM IST

    Sankranti 2024 Movies

    Follow us on

    Sankranti 2024 Movies: సంక్రాంతి సినిమా లా మధ్య పోటీ అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ రేసులో 5 భారీ సినిమాలు ఉన్నాయి… ముఖ్యంగా పండుగ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాని రిలీజ్ చేసి హిట్టు కొట్టాలని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే నార్మల్ రోజుల్లో కంటే పండుగ రోజుల్లో సినిమాలను రిలీజ్ చేస్తే ఆ సినిమా చూసే అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పండుగ రోజు అందరూ ఒకే దగ్గర కలుసుకుంటారు కాబట్టి అందరూ కలిసి సినిమాకి వెళ్లి సంతోషంగా పండుగని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే సంక్రాంతికి చాలా సినిమాలను రిలీజ్ చేసి మంచి సక్సెస్ లు సాధించడానికి ఆయా సినిమాల హీరోలు డైరెక్టర్లు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సంక్రాంతి స్టార్ హీరోలు అందరూ కూడా పోటీ పడుతున్నారు…

    ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా మూడు సంవత్సరాల నుంచి తెరకెక్కుతూనే ఉంది కాబట్టి ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆ చిత్ర యూనిట్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు…

    వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న సైంధవ్ సినిమా కూడా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎప్పటినుంచో రెడీగా ఉంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన థియేటర్ లోకి రావాలి కానీ సలార్ డిసెంబర్ 22వ తేదీన వస్తున్న క్రమంలో సలార్ తో పోటీ ఎందుకు అనే ఉద్దేశ్యం లో ఈ సినిమాని సంక్రాంతి కి పోస్ట్ పోన్ చేశారు… ఇక ఈ సినిమా కూడా మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు…

    ఇక నాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగ సినిమా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. నాగార్జున తప్పకుండా సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం తోనే పట్టుబట్టి మరి డైరెక్టర్ తో చాలా ఫాస్ట్ గా సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి సమయం లో నాగార్జున వెనక్కి తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు…

    రవితేజ హీరోగా వస్తున్న ఈగల్ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రవితేజ సంక్రాంతి పండగను చాలా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటాడు. 2023 సంక్రాంతికి కూడా చిరంజీవి హీరో గా వచ్చిన వాల్తేరు విలేజ్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేశారు. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించిన రవితేజ ఆ సినిమాతో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు కూడా తన సినిమాని సంక్రాంతి రిలీజ్ చేయాలనేది రవితేజ కోరిక కాబట్టి తను కూడా వెనక్కి తగ్గేదే లేదు

    ఇక వీటన్నిటిది ఒక పరిస్థితి అయితే తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమాది మరొక పరిస్థితి… ఈ సినిమాని తప్పకుండా వాళ్ళు సంక్రాంతికి రిలీజ్ చేయాలి ఎందుకంటే నార్త్ లో అయోధ్య రామ జన్మభూమి ప్రతిష్ట కార్యక్రమానికి ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ చూస్తున్నారు…

    ఇక ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయం లో కలిగించుకొని కొన్ని సినిమాలను పోస్ట్ పోన్ చేయించితే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని సినిమాలు ఒక సంక్రాంతి కే రిలీజ్ అయితే అన్ని సినిమాల కలక్షన్ల మీద భారీగా దెబ్బ పడే అవకాశాలు అయితే ఉన్నాయి… చూడాలి మరి ఈ సంక్రాంతి ఏ సినిమాలు డ్రాప్ అవుతాయి, ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది…