Chandrababu Arrested : అప్పుడు బాలకృష్ణ, ఇప్పుడు చంద్రబాబు.. ఇద్దర్నీ అరెస్టు చేసిన ఆఫీసర్‌ ఒక్కరే!

ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణను అరెస్టు చెయ్యడంతో.. సంజయ్‌ టాక్‌ ఆఫ్‌ ఏపీ అయ్యారు.

Written By: NARESH, Updated On : September 10, 2023 3:35 pm

chandrababu balakrishna

Follow us on

AP Politics : అధికారులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఐతే.. ఓ స్థాయి వ్యక్తులతో డీల్‌ చెయ్యడం పెద్ద సవాల్‌. కానీ ఓ అధికారి మాత్రం అటు బాలకృష్ణ, ఇటు చంద్రబాబు ఇద్దర్నీ అరెస్టు చేసి.. తాను మామూలు ఆఫీసర్‌ కాదు అని నిరూపించుకున్నారు.

ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆయన అరెస్ట్‌ అయ్యారు అంటే నమ్మడం కష్టం. ఎందుకంటే.. వైఎస్సార్‌ హయాంలోనే చంద్రబాబును ఎవరూ టచ్‌ చేయలేదు. తనపై 27 కేసులు పెట్టినా ఏమీ చెయ్యలేకపోయారని స్వయంగా చంద్రబాబే అన్నారు. అలాంటి ఆయన్ని.. ఓ సీఐడీ అధికారి.. అరెస్టు చెయ్యడమే కాదు.. తన వాదన బలంగా వినిపించారు కూడా. ఆయనే సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్, ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌. యాదృచ్ఛికం ఏంటంటే.. ఇది వరకు 2004లో వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు.. కాల్పుల కేసులో నందమూరి బాలకృష్ణను కూడా ఆయనే అరెస్టు చేశారు. ఇప్పుడు వైఎస్సార్‌ కొడుకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేయడం కాకతాళీయమే.

వైఎస్సార్‌ ఫ్యామిటీకి అనుకూలమా..
ఈ విషయం తెలిశాక ఆ అధికారి కావాలనే ఇలా చేస్తున్నారనీ, ఆయన వైఎస్సార్‌ ఫ్యామిలీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు రావడం సహజం. ఇలాంటప్పుడే అలాంటి అధికారులపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ వారు ఎలా డీల్‌ చేస్తారన్నది ఆసక్తికరం. బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకుడే. వీళ్లిద్దరితోనే ఆయన ఆగే పరిస్థితి లేదని సంకేతాలిచ్చారు. త్వరలో చంద్రబాబు కొడుకు నారా లోకేశ్‌ను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ప్రెస్‌మీట్‌లో చెప్పారు.

1996 బ్యాచ్‌ అధికారి
సంజయ్‌.. 1996 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. ఆంధ్రప్రదేశ్‌ క్రై మ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్‌ 9న తెల్లారి 6 గంటల సమయంలో చంద్రబాబును అరెస్టు చెయ్యడంతోనే ఆయన పేరు మారుమోగింది. ఎవరా ఆఫీసర్‌ అని చాలా మంది గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు రూ.371 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్‌ తెలిపారు.

2004లో బాలకృష్ణను..
ప్రస్తుతం హిందూపూర్‌ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ… 2004లో హైదరాబాద్‌లో కొంతమందిపై రివాల్వర్‌తో దాడి చేశారనే ఆరోపణలు వచ్చినప్పుడు.. సంజయ్‌.. బాలకృష్ణను అరెస్టు చెయ్యడమే కాదు.. కొన్ని కీలక ఆధారాలు సేకరించారు కూడా. అప్పట్లో సంజయ్‌.. హైదరాబాద్‌ .. వెస్ట్‌ జోన్‌లో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణను అరెస్టు చెయ్యడంతో.. సంజయ్‌ టాక్‌ ఆఫ్‌ ఏపీ అయ్యారు.