Tomato Prices Down : ఏమిటీ విధి వైపరీత్యం : మొన్నటి వరకు మూడంచెల భద్రత.. నేడు రోడ్డు పక్కన టమాటా

టమాటా పంటకు ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో సైతం టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. అక్కడ కిలో టమాట మూడు రూపాయలు పలుకుతోంది.

Written By: Dharma, Updated On : September 8, 2023 10:15 am
Follow us on

Tomato Prices Down : మొన్నటి వరకు టమాటా కూరల్లో తక్కువ.. వార్తల్లో ఎక్కువ అన్నట్టు ఉండేది. ఖరీదైన కూరగాయగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా కిలో 300 రూపాయలకు ఎగబాకింది. కానీ దాని ధర ఆయుష్షు చాలా తక్కువ అన్నట్టు.. వందల శాతం తగ్గుముఖం పట్టి 30 పైసలకు చేరుకుంది. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటుంది.

టమాటా ఏ స్థాయిలో రికార్డు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. చివరకు ప్రజాప్రతినిధులు మాదిరిగా.. మూడంచెల భద్రత నడుమ మార్కెట్లోకి టమాటా అడుగుపెట్టేది. అటు రైతులు సైతం రేయింబవళ్లు పంటను కాపాడుకోవడానికి పడిన శ్రమ అందరికీ విదితమే. ఈ టమాటా విన్యాసాలను కథలుగా చెప్పుకున్నాం. దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు లక్షాధికారులయ్యారు. ఏపీ తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రైతులు కోట్ల రూపాయలు కళ్ల చూసారు. ఈ 100 రోజుల్లో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి.

ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటా ధర 30 పైసలు పలుకుతోంది.టన్నుల కొద్ది డబ్బాలు అమ్మినా రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు రోడ్డు పక్కన టమాటాను పారబోస్తున్నారు. మొన్నటి వరకు అమృతంగా కనిపించే టమాటా.. ఇప్పుడు రోడ్డు పక్కన వృధాగా కనిపిస్తుండటం విచారకరం.

అటు టమాటా పంటకు ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో సైతం టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. అక్కడ కిలో టమాట మూడు రూపాయలు పలుకుతోంది. ఇక హైదరాబాదులో కిలో టమాటా 25 రూపాయల నుంచి 30 రూపాయలు మధ్య ఉండడం విశేషం. మొన్నటివరకు టమాటా తో లాభాలు చూసిన రైతులు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.