https://oktelugu.com/

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపించిన కొత్త కుర్రాళ్లు వీరే…

ప్రస్తుతం సెమీఫైనల్ లోకి అడుగు పెట్టాలని చూస్తున్న న్యూజిలాండ్ టీం మొదట వరసగా నాలుగు మ్యాచ్ ల్లో విజయాలను సాధించి అద్భుతమైన రికార్డును నెలకొల్పింది.

Written By:
  • Gopi
  • , Updated On : November 11, 2023 / 10:13 AM IST

    Odi World Cup 2023

    Follow us on

    Odi World Cup 2023: వరల్డ్ కప్ లో చాలామంది సీనియర్ ప్లేయర్లు అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ వాళ్ల టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ మ్యాచ్ లు గెలిపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా యంగ్ ప్లేయర్స్ గా వరల్డ్ కప్ లో అడుగు పెట్టి ప్రతి మ్యాచ్ లో ఒక వారియర్స్ లా పోరాడి కొత్త కుర్రాళ్ళు అయిన కూడా ఏమాత్రం తడబాటు లేకుండా సీనియర్ల కి ఏ మాత్రం తగ్గకుండా తమ టీం తరఫున పోరాడితే పోయేదేమీ లేదు ఎదవ బానిస సంకెళ్లు తప్ప అన్న రేంజ్ లో తమ టీం తరుపున మ్యాచ్ లు ఆడుతూ విజయ బావుటాని ఎగరేసిన యంగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ టీం తరఫున అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చారో ఒక్కసారి మనం తెలుసుకుందాం…

    ప్రస్తుతం సెమీఫైనల్ లోకి అడుగు పెట్టాలని చూస్తున్న న్యూజిలాండ్ టీం మొదట వరసగా నాలుగు మ్యాచ్ ల్లో విజయాలను సాధించి అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ టీం లో చాలామంది ప్లేయర్లు మంచి పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ ఆ టీంలోకి ఒక యువ స్పిన్నర్ గా ఎంట్రీ ఇచ్చి బ్యాట్స్ మెన్ గా మారిపోయి ఇప్పుడు ఆ టీంలో కీలకమైన బ్యాట్స మెన్ గా గుర్తింపు పొందిన రచిన్ రవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆయన మొదట స్పిన్నర్ గా టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నెంబర్ త్రీ బ్యాట్స్ మెన్ గా అవతరించి ఈ టోర్నమెంట్ లో మూడు సెంచరీలను చేశాడు. ఇక ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన రచిన్ రవీంద్ర మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసి 565 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ లో కూడా మంచి పర్ఫామెన్స్ ని ఇస్తున్నాడు.ఇక ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయడంలో చాలా మంచి నైపుణ్యాన్ని కనబరుస్తున్నాడు… ముఖ్యంగా చేజింగ్ లో ఒత్తిడి ని కంట్రోల్ చేసుకుంటూ అద్భుతమైన పర్ఫామెన్స్ లను ఇస్తున్నాడు. చేజింగ్ లో రెండు సెంచరీలను చేసి న్యూజిలాండ్ టీంకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు… ఇక ఈయన భారత సంతతి చెందిన ప్లేయర్ కావడం విశేషం…

    ఇక సౌతాఫ్రికా కి చెందిన మర్కో జాన్సన్ కూడా ఈ వరల్డ్ కప్ లో తనదైన రీతిలో అద్భుతమైన పర్ఫామెన్ లను ఇస్తూ సౌతాఫ్రికా టీం కి ఎనలేని సేవలను అందిస్తున్నాడు.ముఖ్యంగా సౌతాఫ్రికా సెమీఫైనల్ చేరుకుందంటే అందులో అతని పాత్ర చాలా వరకు ఉందనే చెప్పాలి. మార్కో జాన్సన్ బౌలర్ గానే కాకుండా బ్యాట్స్ మెన్ గా కూడా అదరగొడుతున్నాడు సౌతాఫ్రికా సీనియర్ బౌలర్ అయిన రబాడ, లుంగీ ఎంగిడి లాంటి సీనియర్ బౌలర్లకు సైతం ఏమాత్రం తీసిపోకుండా తనదైన మార్క్ బౌలింగ్ తో అద్భుతాలను చేస్తున్నాడు… ఎనిమిది మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి తనదైన రేంజ్ లో ముందు దూసుకుపోతున్నాడు లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్న మార్కో జాన్సన్ 157 పరుగులు చేశాడు. నిజానికి మార్కో జాన్సన్ రబడా, లుంగీ ఎంగిడి లకి సాధ్యం కానీ రీతిలో అద్భుతమైన బౌలింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.ఇక సౌతాఫ్రికా టీం తరఫున కీలకమైన ప్లేయర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి…

    శ్రీలంక ఈ టోర్నమెంట్లో దారుణమైన ఫేలవమైన పర్ఫామెన్స్ ఇచ్చి టోర్నీ నుంచి నిష్క్రమించడం జరిగింది.ఇక వాళ్ళు ఆడిన 9 మ్యాచుల్లో రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టారు. ఇక శ్రీలంక టీం ఎంత ఫెయిల్ అయినా కూడా ఆ టీం తరఫున ఒక బౌలర్ మాత్రం అద్భుతమైన బౌలింగ్ వేస్తూ ముందుకు దూసుకు వచ్చాడు అతనే దిల్షన్ మధు శంక …ఈయన ఈ వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరుస్తూ వస్తున్నాడు… మధు శంక 9 మ్యాచ్ ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇండియా మీద శ్రీలంక ఆడిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. అలాగే ఈ టోర్నీలో మరోసారి నాలుగు వికెట్లను కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీలంక టీం ఫెయిల్ అయినప్పటికీ మధు శంక మాత్రం చాలా సక్సెస్ఫుల్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు…

    ఇక ఆఫ్గనిస్తాన్ కి చెందిన ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ తనదైన రీతిలో ఆఫ్ఘనిస్తాన్ టీంని గెలిపిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ టీం తరఫున వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ఒకే ఒక ప్లేయర్ గా జద్రాన్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక ఈయన 9 మ్యాచ్ ల్లో 376 పరుగులు చేశాడు. అందులో ఆస్ట్రేలియా మీద ఒక సెంచరీ చేశాడు. పాకిస్తాన్ పైన 87 పరుగులు చేసి ఆ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు…

    ఇక వీల్లే కాకుండా మరి కొంతమంది ఆఫ్గనిస్తాన్ ప్లేయర్స్ కూడా తమదైన రీతిలో అద్భుతాలను క్రియేట్ చేస్తూ వరల్డ్ కప్ లో తమ దైన రీతిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా ఆఫ్గనిస్తాన్ కు చెందిన అజ్మతుల్లా ఉమర్ జాయ్ కూడా తనదైన రీతిలో పర్ఫామెన్స్ ఇస్తూ 3 హాఫ్ సెంచరీలను నమోదు చేసుకుని కీలకమైన సమయంలో ఆఫ్గనిస్తాన్ టీమ్ విజయం లో కీలక పాత్ర వహించాడు…