Nara-Nandamuri Familys : ఆ కుటుంబానిది తెలుగునాట పెద్ద చరిత్ర. సినీ, రాజకీయ రంగాలను ఒంటిచేత్తో ఏలిన ఘనత. ఇప్పటికీ సినిమా రంగంలో ఆ కుటుంబానిది అగ్రస్థానమే. కానీ రాజకీయరంగంలో మాత్రం అథమ స్థానం. సొంతపార్టీని మరొకరి చేతిలో పెట్టి వారికి ప్రచారం చేయడం ఆ కుటుంబానికి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఒక్కొక్కరుగా ప్రమాదాల బారిన పడుతుండటమే ఇందుకు ఉదాహరణ.

ఎన్టీఆర్ తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆయన ప్రజల్లో ముద్రవేశారు. సినీరాజకీయ రంగాల్లో ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించారు. కానీ చివరి రోజుల్లో జీవితంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. సొంత అల్లుడే కుటుంబంతో కలిసి ఆయన నాయకత్వాన్ని ధిక్కరించారు. అధికారాన్ని సైతం లాగేసుకున్నారు. ఇందుకు లక్ష్మీపార్వతే కారణమని ఎన్టీఆర్ కుటుంబం చెబుతున్నప్పటికీ.. ఎన్టీఆర్ ఆ సంఘటనను జీర్ణించుకోలేదు. సొంత బిడ్డలే ఎదురుతిరగడం ఆయన్ను కుంగిపోయేలా చేసింది. దీన్నే చంద్రబాబు వెన్నుపోటు అని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తాయి. చంద్రబాబు వెన్నుపోటు వల్లే ఆయనకు అధికారం దక్కిందని ఆరోపించారు. ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని చెబుతారు.
చంద్రబాబు చేతుల్లోకి తెలుగుదేశం వచ్చాక తొమ్మిదేళ్లు అప్రతిహతంగా ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత ఓటమి పాలయ్యారు. అప్పటి వరకు ఎన్టీఆర్ కుటుంబం టీడీపీకి దూరంగా ఉంది. చంద్రబాబే ఉంచారని చెప్పుకోవచ్చు. 2009 ఎన్నికల ముందు ఎన్టీఆర్ కుటుంబాన్ని ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు ఎత్తు వేశాడు. అందులో భాగంగానే ఉమ్మడి ఏపీలో మహాకూటమిని ఏర్పరిచారు. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ తర్వాత అంతటి ఫేమ్ ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. తాత పోలికలతో పాటు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను ఎన్నికల్లో వాడుకోవడానికి చంద్రబాబు వ్యూహం పన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీలో ప్రచారం నిర్వహించారు. సూర్యపేట ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నైజం తెలుసుకుని టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇటీవల నందమూరి తారకరత్న రాజకీయరంగ ప్రవేశం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమారంగం కలిసి రాకపోవడంతో రాజకీయబాట పట్టారు. తారకరత్న సినిమా రంగంలో రాణించలేకపోయినప్పటికీ … వ్యక్తి మంచి ఇమేజ్ ఉంది. వివాదరహితుడి పేరుంది.
నారాలోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. మొదటిరోజు పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఉన్నట్టుండి జనం మధ్యలో కుప్పకూలిపోయారు. హుటాహుటిన కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గుండెపోటని నిర్ధారించుకున్నారు. వెంటనే బెంగళూరు తరలించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పాదయాత్ర మొదటి రోజే తారకరత్నకు ఇలా కావడం నందమూరి అభిమానులన్ని ఆవేదనకు గురిచేస్తోంది.
సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్, జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్, తారకరత్న గుండెపోటు అంశంతో కొత్త చర్చ వెలుగులోకి వచ్చింది. నారా కుటుంబానికి నందమూరి వంశం ప్రచారం చేయడం కలిసి రావడంలేదన్న చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను విశ్లేషించి ఈ చర్చ చేస్తున్నారు. నారా కుటుంబంతో బంధుత్వం నందమూరి కుటుంబానికి కలిసిరాలేదని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పుడు అలా.. తారకరత్న ప్రచారానికి వచ్చినప్పుడు ఇలా జరగడం పట్ల జనం పెదవి విరుస్తున్నారు. వాస్తవంగా అవన్నీమూఢనమ్మకాలే అయినప్పటికీ.. వరుస ఘటనలు ఇలాంటి చర్చకు దారితీస్తున్నాయి.