https://oktelugu.com/

Chandrayaan 3: రోవర్‌ను వీడియో తీసిన ల్యాండర్‌.. పెరట్లో పాప అంటూ షేర్‌ చేసిన ఇస్రో!

చంద్రునిపై చెక్కర్లు కొడుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. రెండు రోజుల క్రితం తనని తీసుకువెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ను ఫొటోలు తీసి ఇస్రోకు పంపించింది.

Written By: Raj Shekar, Updated On : August 31, 2023 3:03 pm

Chandrayaan 3

Follow us on

Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌–3 విజవంతమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్‌. ఇక చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ సేఫ్‌ ల్యాండ్‌ అయిన తర్వాత.. అందులో నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పనిని విజయవంతంగా చేస్తోంది. జాబిల్లికి సంబంధించిన అనేక సమాచారాన్ని పంపుతుంది. ఇస్రో ఆశించినదానికన్నా ఎక్కువ పనితీరు కనబరుస్తోంది.

ల్యాండర్‌ను ఫొటోలు తీసిన రోవర్‌..
చంద్రునిపై చెక్కర్లు కొడుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. రెండు రోజుల క్రితం తనని తీసుకువెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌ను ఫొటోలు తీసి ఇస్రోకు పంపించింది. ఈ ఫొటోను ఎక్స్‌(ట్విటర్‌) ఖాతా ద్వారా ఇస్రో పంచుకుంది. స్మైల్‌ ప్లీజ్‌ అంటూ ఈ ఫోటోను షేర్‌ చేసింది ఇస్రో. చంద్రుడిపై ఉపరితలంపై వారం రోజులుగా అన్వేషణ కొనసాగిస్తోన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. విక్రమ్‌ ల్యాండర్‌ను తన నావిగేషన్‌ కెమెరాల సాయంతో రోవర్‌ ఫోటోలు తీసింది.

రోవర్‌ను వీడియో తీసిన ల్యాండర్‌..
ల్యాండర్‌ను రోవర్‌ ఫొటోలు తీస్తే.. ల్యాండర్‌ తానేమీ తక్కువ కాదన్నట్లు.. నిన్ను మోసుకొచ్చింది నేనే.. నా గర్భంలో నుంచి వచ్చిన పాపవు నీవు అన్నట్లుగా.. చందమామపై చెక్కర్లు కొడుతున్న ప్రజ్ఞాన్‌ రోవన్‌ను ఏకంగా వీడియో తీసింది. రెండు రోజుల క్రితం రోవర్‌కు పెద్ద గొయ్యి అడ్డు రావడంతో సురక్షితమైన మార్గం కోసం రోవర్‌ను తిప్పారు. ఈ భ్రమణాన్ని ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా ద్వారా క్యాప్చర్‌ చేసింది. బెంగళూర్‌లోని ఇస్ట్రో కంట్రోల్‌ రూమ్‌కు పంపించింది. దానిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ల్యాండర్, రోవర్‌ సమర్థవంతంగా పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వీడియోను ట్విటర్టర్‌లో పోస్టు చేసింది ఇస్రో.. ‘చందమామ పెరట్లో చిన్నపిల్ల ఆడపడుచుగా ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తోంది’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

జాబిల్లి గురించి అనేక కొత్త విషయాలు..
ఇక జాబిల్లి గురించి ప్రజ్ఞాన్‌∙రోవర్‌ అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తోంది. ఇప్పటికే చంద్రునిపై చంద్రుడిపై ఆక్సిజన్, సిలికాన్‌ వంటి మూలకాలను గుర్తించి సమాచారాన్ని ఇస్రోకు పంపింది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలంపై అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్, టైటానియం, మాంగనీస్‌ వంటి మూలకాలను కూడా గుర్తించారు. ఇక హైడ్రోజన్‌ కోసం ప్రజ్ఞాన్‌ రోవర్‌ అన్వేషణ ప్రారంభించింది. అది కనుక ఉంటే చంద్రుడిపై నివసించే అవకాశం మనుషులకు దొరుకుతుంది. మరోవైపు చంద్రునిపై సల్ఫర్‌ ఉన్నట్లు మరోరాసి రోవర్‌ నిర్ధారించింది. ఈమేరకు ఇస్రోకు సమాచారం పంపించంది.

https://twitter.com/isro/status/1697156752641536030?t=6WWbigjgBJEX9URk5z_tSA&s=08