India Vs South Africa 2nd Test: భారీ విక్టరీ కొట్టిన ఇండియన్ టీమ్…147 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్…

ఇండియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టీం 642 బంతుల్లోనే ఈ మ్యాచ్ ని ముగించేసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. 147 సంవత్సరాల క్రితం నాటి రికార్డును ఇప్పుడు ఇండియన్ టీమ్ బ్రేక్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : January 5, 2024 12:10 pm

India Vs South Africa 2nd Test

Follow us on

India Vs South Africa 2nd Test: ఇండియా సౌతాఫ్రికా తో ఆడిన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీం 55 పరుగులకే అలవాటు కావడం ఇండియన్ టీమ్ కి బాగా కలిసి వచ్చింది. ఇక మన బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ తనదైన రీతిలో బంతులు వేసి సౌతాఫ్రికా ప్లేయర్లకి ముచ్చెమటలు పట్టించాడు. అందువల్ల ఈ మ్యాచ్ ని ఇండియన్ టీం ఈజీగా గెలిచింది.

ఇక ఈ గెలుపుతో 147 సంవత్సరాల కిందటి రికార్డుని ఇండియన్ టీమ్ బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఒకటిన్నర రోజుల్లో అతి తక్కువ సమయంలో మ్యాచ్ ని గెలిచి ఇండియా సౌతాఫ్రికా టీములు ఘనమైన రికార్డుని సృష్టించాయనే చెప్పాలి. ఇక ఇంతకుముందు టెస్ట్ క్రికెట్లో 788 బంతుల్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ అనేది ముగిసిపోయింది. దాని తర్వాత 656 బంతుల్లోనే ఆస్ట్రేలియా సౌతాఫ్రికా టీముల మధ్య జరిగిన మ్యాచ్ అనేది ముగిసిపోయి అంతకు ముందున్న రికార్డును బ్రేక్ చేసింది.

ఇక ఇప్పుడు ఇండియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టీం 642 బంతుల్లోనే ఈ మ్యాచ్ ని ముగించేసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. 147 సంవత్సరాల క్రితం నాటి రికార్డును ఇప్పుడు ఇండియన్ టీమ్ బ్రేక్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. దీంతో ఈ టెస్ట్ సిరీస్ సమం అయింది. రెండు టెస్టు మ్యాచుల్లో మొదటి టెస్ట్ మ్యాచ్ వాళ్లు గెలిస్తే రెండో మ్యాచ్ ఇండియా గెలిచింది.

దాంతో సిరీస్ అనేది సమమైంది ఇక 2025 వ సంవత్సరంలో ఆడాల్సిన డబ్ల్యూటీసి మ్యాచుల కోసం ఇప్పటి నుంచే ఇండియన్ టీం టెస్ట్ క్రికెట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు కదులుతుంది. అందులో భాగంగానే ఈ టెస్ట్ సిరీస్ ని సమం చేసి మరోసారి ఇండియన్ టీమ్ తన సత్తా ఏంటో చూపించింది. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మహమ్మద్ సిరాజ్ నిలవగా ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా జస్ప్రిత్ బుమ్రా నిలిచాడు…