https://oktelugu.com/

Tollywood : ప్రొడ్యూసర్ల కి 170 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్

కాబట్టి రాధే శ్యామ్ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఆయనకి సినిమా ఇచ్చే హీరో కరువయ్యడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 19, 2024 / 09:50 AM IST
    Follow us on

    Tollywood : కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీకి ఒక వంతుకు మేలు చేసిందనే చెప్పాలి. ఇక దానివల్ల ఓటిటి ప్లాట్ ఫామ్ బాగా పాపులర్ అయింది. అప్పటివరకు ఓటిటి ప్లాట్ ఫామ్ ఉన్నప్పటికీ కరోనా తర్వాత నుంచి బాగా పాపులర్ అయింది. ఇక జనాలు వీటిలో సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. దానివల్ల వివిధ భాషల్లోని సినిమాలు కూడా ప్రేక్షకులకు ఫోన్ లోనే అందుబాటులో ఉండడం ఆడియెన్స్ వాటిని చూడడం వల్ల సినిమా స్పాన్ భారీగా పెరిగిపోయింది.అలాగే సినిమా చూసే జనం అభిరుచి కూడా మారుతూ వచ్చింది. ఇక దాని వల్ల కొత్త థాట్స్ తో మంచి సినిమాలు తీసే దర్శకులు కూడా మన ముందుకు వస్తున్నారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే కరోనా తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్లు గా మిగిలిపోయాయి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తరువాత సాహో సినిమా చేసి ఓకే అనిపించాడు. ఇక ఆ తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేశాడు ఇది 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా మీద ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాళ్ల అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ చాలావరకు వెనుకబడిపోయింది.

    ఇక ఈ సినిమా 125 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్ గా మిగలడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లో కూడా వరస్ట్ సినిమాగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. ఇక నిజానికి ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ స్క్రిప్ట్ ప్రభాస్ కి సెట్ అవ్వలేదు ఒకటైతే, అసలు ఈ సినిమాలో ప్రభాస్ ని మనం లవర్ బాయ్ గా చూడడం అనేది చాలా కష్టమైన పని…ఈ సినిమా కనక మిర్చి సినిమా వచ్చిన టైమ్ లో ప్రభాస్ కి పడి ఉంటే కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకునేది. ఇక దీనికి పెట్టిన బడ్జెట్ కూడా మరి ఓవర్ గా అయింది. దానివల్ల ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ని కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి. ఇక ఓవరాల్ గా ఈ సినిమా 70 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చిందంటూ ట్రేడ్ పండితులు లెక్కలు చెబుతున్నారు. ఈ దెబ్బతో ఈ సినిమా దర్శకుడైన రాధాకృష్ణ ఇప్పటివరకు మరొక సినిమానైతే అనౌన్స్ చేయలేదు.

    ఇక ఇప్పటికీ ఈ సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా డైరెక్టర్ మరొక సినిమా అనౌన్స్ చేయకపోవడం పట్ల చాలామంది ట్రేడ్ పండితులు సైతం రాధాకృష్ణ అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంతకుముందు రాధాకృష్ణ గోపీచంద్ ని హీరోగా పెట్టి జిల్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ ప్రభాస్ తనతో సినిమా చేస్తానని ముందే రాధాకృష్ణ కి మాట ఇచ్చాడు కాబట్టి రాధే శ్యామ్ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఆయనకి సినిమా ఇచ్చే హీరో కరువయ్యడనే చెప్పాలి…