https://oktelugu.com/

Sugar Exports Ban: నిన్న బియ్యం.. నేడు చక్కెర.. కేంద్రం ఎగుమతుల నిషేధం వెనుక కథేంటి?

ప్రతికూల వాతావరణం, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్ మీద ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత్ చెక్కర విషయంలో నిషేధం విధిస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : August 8, 2023 / 09:36 AM IST
    Follow us on

    Sugar Exports Ban: ఇప్పటికే బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతుల మీద నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం… ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతోంది. ఎగుమతుల పై నిషేధం విధిస్తున్న జాబితాలో తర్వాత స్థానం చెక్కర ఉండవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. బియ్యం ఎగుమతి నిషేధం ఆహార భద్రత, ద్రవ్యోల్బణం పై ప్రభుత్వం ఆందోళనకు స్పష్టమైన సంకేతమని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. చక్కెర తర్వాత, ఇథనాల్ మీద కూడా కేంద్రం నిషేధం విధించవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

    సంక్షోభాల మీద సంక్షోభాలు

    ప్రతికూల వాతావరణం, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆహార మార్కెట్ మీద ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత్ చెక్కర విషయంలో నిషేధం విధిస్తోంది. దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు బియ్యం పై నిషేధం విధించిన ప్రభుత్వం.. మరో ముఖ్యమైన నిత్యావసర వస్తువు చక్కెరపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ సరఫరాలు కఠినతరం కావడంతో దక్షిణాసియా దేశాల నుంచి ప్రపంచం చక్కర ఎగుమతులపై ఎక్కువ ఆధారపడుతోంది. దీనికి తోడు భారత్ లాంటి దేశంలో అసమానమైన వర్షపాతం నమోదు కావడం చెరుకు పంట దిగుబడిపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇప్పటికే గత రెండు సీజన్లో విస్తారమైన వర్షాలు కురవడం వల్ల చెరుకు పంట దిగుబడి తగ్గింది.. ఇది కూడా ప్రభుత్వం చక్కెర ఎగుమతి పై నిషేధం విధించేందుకు ఒక కారణమని ఆర్థికవేత్తలు అంటున్నారు. అక్టోబర్ నెలలో చెరకు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురవడంతో ఈ సీజన్ లోనూ దిగుమతి ఆ స్థాయిలో ఉండకపోవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఇది దేశం ఎగుమతి సామర్థ్యాన్ని పరిమితం చేసే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. దేశీయ సరఫరాలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, బియ్యం పై నిషేధం విధించింది.

    దిగుబడి మీద ప్రభావం

    చెరుకు పంటకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో ఆశించినంత స్థాయిలో దిగబడి రావడం లేదు. ఇది సరఫరా వ్యవస్థ మీద ఒత్తిడికి కారణమైంది. 2023_24 లో చక్కర ఉత్పత్తి ఏడాది క్రితం నుంచి 31.7 మిలియన్ టన్నులకు అంటే 3.4% తగ్గుతుందని ఒక అంచనా. అయినప్పటికీ దేశీయంగా ఎదురయ్యే డిమాండ్ ను తీర్చగలుగుతుందని తెలుస్తోంది..కాగా, ఇథనాల్ ను తయారు చేసేందుకు భారత ప్రభుత్వం 4.5 మిలియన్ టన్నుల చక్కెరను మళ్లించిందని సమాచారం. గత ఏడాదితో పోలిస్తే ఇది 9.8% ఎక్కువ. ఇక, భారత్ గతంలో చక్కెర ఎగుమతులను పరిమిత స్థాయిలోనే చేసేది. 2022_23 సీజన్ లో, ఎగుమతులు 6.1 మిలియన్ టన్నులకు పరిమితం చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం 11 మిలియన్ టన్నులు ఉండేది.