Telugu Film Producers Stop Shoots: తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రోజు నుంచి షూటింగ్ లు బంద్ అయ్యాయి. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా.. వాటికి పరిష్కారం లభించే వరకు ఇక షూటింగ్ లు జరగవు అని నిర్మాతలు తేల్చి చెప్పారు. షూటింగ్ మొదలు కావాల్సిన సినిమాలకు పెద్దగా లాస్ ఉండదు. కానీ.. ఇప్పటికే రన్నింగ్ లో ఉన్న సినిమాల పరిస్థితి ఏమిటి ?, సహజంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఫైనాన్స్ మీదే నడుస్తాయి. కాబట్టి అలాంటి సినిమాల నిర్మాణం పై ఇప్పుడు పెను ప్రభావం పడనుంది. అలాగే పెద్ద సినిమాలు కూడా మధ్యలో ఆగిపోవడం వల్ల ఇండస్ట్రీ పై కూడా ఆ ప్రభావం రెట్టింపు కోటాలో పడనుంది. ముఖ్యంగా వేలమంది సినీ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడనున్నారు.

మరి.. ఇండస్ట్రీ పై అలాంటి ప్రభావం చూపే పెద్ద చిత్రాల్లో ఏ ఏ సినిమాలు ఉన్నాయో చూద్దాం రండి.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేంగా జరుగుతోంది. ఈ సినిమా షూట్ ఆగిపోవడంతో 200 మంది జూనియర్ ఆర్టిస్ట్ లకు, 30 మంది చిన్న సాంకేతిక బృందానికి పని పోయింది.
అలాగే చిరంజీవి మరో సినిమా ‘గాడ్ ఫాదర్’ సినిమా కారణంగా 60 మంది జూనియర్ ఆర్టిస్ట్ లకు, 25 మంది చిన్న సాంకేతిక బృందానికి పని పోయింది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రవితేజ, ఈ సినిమా కారణంగా మరో సినిమాకి డేట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనె హీరోయిన్‌గా రాబోతున్న సినిమా ప్రాజెక్ట్ K. సమ్మె ఎఫెక్ట్ తో ఈ సినిమా కోసం పనిచేస్తున్న 300 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, 90 మంది సాంకేతిక బృందం ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో షూట్ చేస్తున్నాడు. ఈ సినిమా వల్ల కూడా వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లకు పని దొరుకుతుంది. అలాగే పదుల సంఖ్యలో సాంకేతిక బృందం ఈ సినిమాతో బిజీగా ఉంది. ఇప్పుడు వారంతా ఆగమ్యగోచరంలో ఉన్నారు.
కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ సినిమా కూడా ఆగిపోయింది. అలాగే అఖిల్ ఏజెంట్, అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాలు ఆగిపోవడం వల్ల కూడా వందల మందికి పని పోయింది.
అదే విధంగా రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఆగిపోవడం కారణంగా కూడా దాదాపు 200 మంది తమ పనిని కోల్పోయారు.

అసలు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలు ఉంటే.. ఆ సమస్యలు తీర్చగలిగే వారితో చర్చ జరపాలి. అంతేగాని అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఎవరి మీద కోపాన్ని, సినీ కార్మికుల పై చూపడం దురదృష్టకరం. నిజానికి కరోనా కారణంగా గత మూడేళ్లుగా సినీ కార్మికులు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇపుడిపుడే వాళ్ళు కోలుకుంటున్నారు. ఈ లోపే ఇలా సడెన్ గా షూటింగ్ లు బంద్ చేయడం ఎంతవరకు సమంజసం ?,
హీరోలకు కోట్లకు కోట్లకు ఇచ్చే నిర్మాతలు, 24 క్రాఫ్ట్ మెంబర్స్‌కు చెందిన చిన్న వారికి ఎంగిలి మెతుకులు కూడా విదిల్చేలా లేరు. అసలు ఈ ప్రొడ్యూసర్స్ గిల్ట్ ఇండస్ట్రీలోని సమస్యలను ఓ కొలిక్కి తేస్తోందా ?, లేక కొత్త సమస్యలను సృష్టిస్తోందా ?.. బహుశా చిన్న వారి సమస్యల గురించి బడా నిర్మాతలు కనీసం ఆలోచన కూడా చేసి ఉండరు.
Also Read:Jabardast New Anchor: ‘జబర్దస్త్’ ట్విస్ట్.. కొత్త యాకంర్.. డిఫరెంట్ ఎట్రీ!
[…] Also Read: Telugu Film Producers Stop Shoots: గిల్ట్ నిర్మాతలూ.. అత్త మ… […]
[…] Read: Telugu Film Producers Stop Shoots: గిల్ట్ నిర్మాతలూ.. అత్త మ… Recommended […]