దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు మొబైల్ ఫోన్లను కలిగి ఉన్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తుంటే కొంతమంది మాత్రం ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. టెలీకాం రంగంలోకి జియో ఎంట్రీ తరువాత డేటా ధరలు తగ్గడంతో డేటా వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. అయితే టెలీకాం కంపెనీలు మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: 100 మంది పిల్లల్ని కనాలనుకుంటున్న మహిళ.. ఎందుకంటే..?
నివేదికలు రాబోయే రోజుల్లో టారిఫ్ ధరలు భారీగా పెరగనున్నాయని పెరిగిన ధరలు మొబైల్ ఫోన్ యూజర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి. ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో టెలీకాం కంపెనీలు ధరలను పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ పెట్టుబడుల సమాచార సంస్థలలో ఒకటైన ఇక్రా రాబోయే ఒకటి రెండు త్రైమాసికాల్లో మొబైల్ కంపెనీలు ఛార్జీలను పెంచే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: ఎల్‌ఐసీ బెస్ట్ పాలసీ.. రోజుకు రూ.64తో చేతికి రూ.13 లక్షలు..?
రాబోయే ఒకటి, రెండు త్రైమాసికాల్లో కంపెనీలు మొబైల్ ఛార్జీలను చెల్లించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరోవైపు టెలీకాం కంపెనీలు రాబోయే రోజుల్లో 5జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. స్పెక్రమ్ చెల్లింపులకు టెలీకాం కంపెనీలకు భారీ మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో టారిఫ్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
5జీ సేవలను త్వరగా అందుబాటులోకి తెస్తే మాత్రమే కస్టమర్లకు మెరుగైన సేవలు అందుతాయి. దేశంలో లాక్ డౌన్ తర్వాత డేటా వినియోగం భారీగా పెరగడంతో టారిఫ్ ధరలను పెంచితే ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.