Telangana TET 2024 : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా డీఎస్సీకి ముందే తెలంగాణ టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు గురువారం(మార్చి 4న) టీఎస్ టెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ప్రభుత్వం ఆమోదించిన కొద్దిసేపటికే..
టీఎస్ టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. డీఎస్సీ కన్నా ముందే టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ గురువారం(మార్చి 14న) ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరువు జారీ అయిన కొద్ది సేపటికే తెలంగాణ టెట్ – 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రయోజనం కలుగుతుందని సమాచారం.
కొనసాగుతున్న డీఎస్సీ దరఖాస్తులు..
ఇదిలా ఉండగా మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్కూల్ అసిసె‍్టంట్ పోస్టుల 2,629 ఉండగా, భాషా పండితులు 727 ఉన్నాయి. పీఈటీ పోస్టులు 182, ఎస్జీటీ పోస్టులు 6,508 ఉన్నాయి. వీటితోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 220 స్కూల్ అసిసె‍్టంట్ , 796 ఎసీ‍్జటీ పోస్టులు ఉన్నాయి. ఈమేరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు ఉంది. ఏప్రిల్ 3త దరఖాస్తు గడువు ముగుస్తుంది.