Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ పంపిన కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడుసార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇందులో రూ.400 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. నాలుగు మెయిల్స్‌లో మూడు హత్య బెదిరింపుకు సంబంధించినవే. దీంతో ముంబై పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వారం రోజుల్లోనే పురోగతి సాధించారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అతడి వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నాలుగు రోజుల్లో మూడు మెయిల్స్..
అక్టోబర్ 27న ముఖేష్ అంబానికి తొలి మెయిల్ వచ్చింది. ఇందులో రూ. 400 కోట్లు ఇవ్వకపోతే హత్య చేస్తామని ఉంది. తర్వాత రాలుగు రోజుల్లో మరో రెండు మెయిల్స్ వచ్చాయి. ఇందులో కూడా హత్యచేస్తామని బెదిరింపు ఉంది. భద్రత ఎంత కట్టుదిట్టమైనా ’ఒక్క స్నిపర్’ సరిపోతుందని అంబానీకి మెయిల్ వచ్చింది. పంపిన వారి మాట వినకపోవడంతో ఇప్పుడు రూ.400 కోట్లు చెల్లించాలని మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
రంగంలోకి ముంబై పోలీసులు..
వరుస బెదిరింపు మెయిల్స్‌తో ప్రస్తుతమైన ముంబై పోలీసులు ముఖేష్ అంబానీకి వచ్చిన బెదిరింపు మెయిల్ ఫేక్ ఈమెయిల్ అడ్రస్ ద్వారా పంపారా లేక నిజమైనదేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇమెయిల్ చిరునామాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు మెయిల్ ప్రొవైడర్ కంపెనీని సంప్రదించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అంబానీకి అక్టోబర్ 27 నుంచి ఒకే ఈమెయిల్ ఐడీ నుంచి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. అన్ని బెదిరింపు ఇమెయిల్‌లు డబ్బులు డిమాండ్ చేశాయని అధికారులు తెలిపారు.
శుక్రవారం కూడా మెయిల్..
అక్టోబర్ 27న తొలిసారి గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.20 కోట్లు ఇవ్వకపోతే ముకేశ్ అంబానీని చంపుతామంటూ ఓ మెయిల్ వచ్చింది. మళ్లీ 31న అదే ఈమెయిల్ నుంచి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. గతంలో మేము పంపిన మెయిల్‌కు స్పందించలేదు కాబట్టి, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.20 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పెంచుతున్నామని అగంతకులు మెయిల్ చేశారు. రూ.200 కోట్లు చెల్లించకుంటే అంబానీని కాల్చి చంపేస్తానని ఒకరోజు తర్వాత మరో ఇమెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తాజాగా నంబర్ 1న అదే మెయిల్ నుంచి రూ.400 కోట్లు చెల్లించాలని మరో మెయిల్ వచ్చింది.
అన్నీ ఒకే ఐడీ నుంచి
మూడు ఇమెయిల్‌లు ఒకే ఇమెయిల్ ఐడీ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వాటిని పంపిన వ్యక్తి షాదాబ్‌ఖాన్‌గా గుర్తించామని అధికారులు తెలిపారు. జర్మనీలోని బెల్జియం నుంచి మెయిల్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. పారిశ్రామికవేత్త సెక్యూరిటీ ఇన్‌చార్జి ఫిర్యాదు మేరకు గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుల కోసం వేట మొదలు పెట్టారు.
తెలంగాణ యువకుడి అరెస్ట్?
ఈ క్రమంలో ముఖేష్ అంబానీకి బెదిరింపు మెకిల్ పంపిన కేసులో పురోగతి సాధించారు. గామ్‌దేవి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేశ్ రమేశ్ వనపర్ధిగా గుర్తించిన పోలీసులు అతడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పర్చగా నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు తెలిపారు. షాదాబ్ ఖాన్ అనే పేరుతో ముఖేష్ అంబానీకి మెయిల్ పంపినట్లు నిర్ధారించారు.
బిజినెస్‌మెన్ సినిమాలో తరహాలో..
2012లో వచ్చిన మహేష్‌బాబు సినిమా బిజినెస్‌మెన్ సినిమాను నిందితుడు ఫాలో అయినట్టున్నాడు. అందులో హీరో ముంబైలో బడా వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు సంపాదిస్తాడు. అచ్చం అలాగే ఈ నిందితుడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీని ఈమెయిల్స్ ద్వారా రూ.కోట్లు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు.