TRS MLAs Poaching Case: తెలంగాణలో బీజేపీ బీఆర్‌ఎస్ మధ్య దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న అంతర్యుద్ధానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెక్ పెట్టింది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన కొంతంది కొనుగోలు చేయాలని చూశారని కేసీఆర్ ఆరోపించారు. ఈమేరకు తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్‌రెడ్డిని కొనుగోలు చేయడానికి రామచంద్రభారతి, సింహయాజి, నందుకుమార్ మోయినాబాద్ ఫామ్‌హౌస్‌లో యత్నించారని ఆరోపించింది. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే దర్యాప్తు చేయడానికి సిట్ కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

సిట్ దర్యాప్తుపై అనుమానాలు..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఈకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. సిట్ పూర్తిగా కేసీఆర్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగడం లేదని ముగ్గురు నిందితులతోపాటు బీజేపీ, మరో అడ్వకేట్ శ్రీనివాస్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.
బీజేపీ అగ్రనేతలకు సిట్ నోటీసులు…
ఇదిలా ఉండగా సిట్ దర్యాప్తు అనేక అనుమానాలకు తావిచ్చింది. కేవలం బీజేపీ నేతల టార్గెట్‌గానే విచారణ చేపట్టింది. కేసీఆర్ దిశానిర్దేశం మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్‌ను ఇందులోకి లాగాలని, తర్వాత మోదీ, అమిత్‌షా ఉన్నట్లు ప్రచారం చేయాలని కే సీఆర్ భావించారు. ఈమేరకే సిట్ కూడా నోటీసులు ఇచ్చింది. సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి తన అధికారాలన్నీ ఉపయోగించింది. కానీ కోర్టును ఆశ్రయించిన సంతోష్‌కు ఉపశమనం లభించింది.
సిట్‌ను రద్దు చేసిన కోర్టు..
సిట్ దర్యాప్తుపై నిందితులు, బీజేపీ, న్యాయవాది శ్రీనివాస్ కోర్టును ఆదేశించగా బీజేపీ, న్యాయవాది పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు సిట్ దర్యాప్తును నిలిపివేసింది. ఎమ్మెల్యేల ఎర కోసు దర్యాప్తు చేసే అర్హత సిట్‌కు లేదని స్పష్టం చేసింది. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన వివరాలను సీబీకి అప్పగించాలని కూడా ఆదేశించింది. దీంతో బీజేపీని దెబ్బకొట్టాలని చూసిన కేసీఆర్‌కు న్యాయస్థానంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
రంగంలోకి సీబీఐ..
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగనుంది. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా ఆగస్టులోనే కేసీఆర్ రహస్యంగా జీవో 51 ఇచ్చారు. దీనిని రహస్యంగా ఉంచారు. కవిత పేరు లిక్కర్ స్కాంలో బయటకు వచ్చిన వెంటనే కేసీఆర్ సర్కార్ సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా జీవో ఇచ్చారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగబోతోంది. అదికూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

కేసీఆర్ ముంద రెండు అవకాశాలు..
హైకోర్టు తీర్పుపై వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించడం, లేదా బీజేపీ కుట్ర అంటూ ప్రజా క్షేత్రంలో ప్రచారం చేయడం. డివిజన్ బెంజ్‌ను కూడా ఆశ్రయించే అవకాశం కేసీఆర్ సర్కార్‌కు ఉంది. ఈ నేపథ్యంలో తర్వాత కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి వీడియోలు రిలీజ్ చేయడం, కాల్ రికార్డులు బయట పెట్టడమే కోర్టు సిట్ దర్యాప్తునకు బ్రేక్ వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుప్రీం కోర్టులో కూడా ఇదే తీర్పు వస్తుందన్న అభిప్రాయం న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పు, వద్దన్న సీబీఐ తెలంగాణలోకి రానుండం కేసీఆర్ సర్కార్‌కు పెద్ద షాక్ ని చెప్పవచ్చు.