Telangana High Court: ఫేక్ కంపెనీకి 800 ఎకరాలు.. బాబు విజన్ ను బట్టబయలు చేసిన తెలంగాణ హైకోర్టు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఎంజి భారత సంస్థతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఎటువంటి అనుభవం లేని సంస్థకు అన్ని ఎకరాల భూములు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వం ప్రశ్నించింది.

Written By: Suresh, Updated On : March 9, 2024 11:41 am

Telangana High Court

Follow us on

Telangana High Court: ఊరు తెలవదు, పేరూ తెలవదు. ఆ కంపెనీ క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెప్తే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నమ్మింది. అడ్డగోలుగా భూములు కేటాయించేందుకు సమ్మతం తెలిపింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 ఎకరాల భూమిని అప్పగించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 50వేల కోట్ల వరకు ఉంటుంది. ఆ భూములకు సంబంధించి ఎకరం 50 వేల చొప్పున నాటి చంద్రబాబు ప్రభుత్వం 800 ఎకరాలు కేటాయించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడటం.. ఆ భూ ఒప్పందాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత ఏం జరిగిందంటే..

2003లో..

చంద్రబాబు ప్రభుత్వం.. 2003లో ఐఎంజి భారత అనే కంపెనీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యద్భుతమైన క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెప్పడంతో.. ఓకే చెప్పింది. ఒలంపిక్ క్రీడలు నిర్వహించేలాగా మైదానాలను తీర్చి తిద్దుతామని ఐఎంజీ భారత సంస్థ అధినేత అహోబిలరావ్ అలియాస్ బిల్లీ రావ్ ప్రకటించారు. ప్రభుత్వం కూడా ఆ సంస్థ గురించి ఆరా తీయకుండా భూములు కేటాయించింది. అది కూడా రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లి లో విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉన్న 450 ఎకరాలు కేటాయించింది. ఒక్కొక్క ఎకరాన్ని 50 వేల చొప్పున అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఐ ఎం జి భారత సంస్థకు కేటాయించింది. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న కొద్దిరోజులకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఎంజి భారత సంస్థతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఎటువంటి అనుభవం లేని సంస్థకు అన్ని ఎకరాల భూములు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వం ప్రశ్నించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న భూ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఐఎంజి భారత సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ కేసు నడుస్తూనే ఉంది. వాస్తవానికి 2003లో అక్కడ ఎకరం ధర 10 కోట్ల దాకా పలుకుతోంది. అంతటి ధర ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కేవలం 50 వేలకే ఎకరం చొప్పున ఆ సంస్థకు కేటాయించడం విశేషం. ఇక సుదీర్ఘ వాదోపవాదుల తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. 2006 నుంచి కోర్టులో స్టేటస్ కో లోనే ఈ కేసు ఉండిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో వేల కోట్ల భూమి ప్రభుత్వానికి దక్కింది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తీర్పురావడం టిడిపి శ్రేణులకు మింగుడు పడటం లేదు. దీనిని వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది.