https://oktelugu.com/

TS Schools : స్కూలు పిల్లల బాధ తీర్చిన కేసీఆర్.. నువ్వు సూపర్ సారూ..

తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు ఇక నుంచి ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మారుస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2023 / 09:58 PM IST
    Follow us on

    TS Schools : మంచి చేస్తే మెచ్చుకోవాలి.. చెడు చేస్తే తిట్టుకోవాలి.. తెలంగాణలో అంతే బై.. అయితే చాలా అంశాల్లో కేసీఆర్ ను తిట్టే జనాలు ఇప్పుడు ఒక విషయంలో మాత్రం మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ చేసిన పనికి ఆయన నోట్లో చక్కెర పోయాలని అంటున్నారు. అఫ్ కోర్స్ .. కేసీఆర్ కు షుగర్ ఉంటే పోయలేం అనుకో.. అది వేరే సంగతి.

    తెలంగాణలో విద్యావ్యవస్థను అస్సలు కేసీఆర్ పట్టించుకోడని.. జగన్ లా స్కూళ్ల దశ దిశ మార్చలేదని.. ఓ టీచర్ జాబులు వేయడం లేదని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని బోలెడన్నీ కంప్లైంట్లు ఉన్నాయి. అయితే అన్నింటిపై కేసీఆర్ ను తిట్టే జనాలు ఇప్పుడు మాత్రం ఈ విషయంలో మెచ్చుకుంటున్నారు. దానికి కారణం ఉంది.

    తెలంగాణలోని హైదరాబాద్ సహా అన్ని జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల స్కూలు పిల్లలు, వారి తల్లిదండ్రులు కేసీఆర్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఉదయం 5 గంటలకు లేచి పిల్లలను రెడీ చేసి వారికి టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టి సద్దికట్టి ఉదయం 8 గంటలకల్లా స్కూలుకు పంపించేవారు తల్లిదండ్రులు. దీనివల్ల పిల్లలు కంటినిండా నిద్ర పోవడం లేదు. స్కూల్లో కురిపిట్లు కురుస్తున్నారు. నిద్రతో కళ్లు మూస్తున్నారు.

    ఇక తల్లిదండ్రులకు ఉదయమే లేచి ఇవన్నీ రెడీ చేసి పంపేసరికి తలప్రాణం తోకకు వస్తోంది. మన చిన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లు ఉదయం 10 గంటలకు మొదలయ్యేవి. తాపీగా అన్నీ పనులు పూర్తి చేసుకొని స్కూళ్లకు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లన్నీ 8 లేదా 8.30 గంటలకే మొదలవుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. విద్యార్థులు నిద్రలేక అగచాట్లు పడుతున్నారు. వీరందరి బాధలు బాగా తెలుసుకున్న కేసీఆర్ సర్కార్ తాజాగా స్కూళ్ల టైమింగ్ మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు ఇక నుంచి ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మారుస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక పాఠశాలలు అంటే 1-5 తరగులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకూ నడుస్తాయి. ఇక ఉన్నత పాఠశాలలు అంటే 6-10 తరగతులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకూ పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఈ టైమింగ్ తో సిలబస్ కాదు.. తరగతులు నష్టం అనే వారు కూడా ఉన్నారు. కానీ పిల్లలకు మాత్రం అంత పొద్దున్న లేచి వెళ్లే టైం కంటే ఇది బెటర్ అని చెప్పొచ్చు.

    అంతా బాగానే ఉంది కానీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల బ్యాచ్ ఈ ప్రభుత్వ టైమింగ్ లను ఫాలో అయినప్పుడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం.. ఇప్పటికే ‘నువ్వు దేవుడివి సామీ మా బాధను అర్థం చేసుకున్నావు’ అని విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ టైమింగ్ నిక్కచ్చిగా ఫాలో అయ్యేలా కేసీఆర్ చేస్తారో.. లేక ప్రైవేటు వారి ఇష్టారాజ్యంగా వదిలేసి మళ్లీ విమర్శల పాలవుతారో వేచిచూడాలి.