Telangana Elections 2023: సెగ్మెంట్‌ స్కాన్‌∙: బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదురించిన బీసీ బిడ్డ.. మంథనిలో గెలుపు ఎవరిది?

మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన పుట్ట మధు.. కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత పరిణామాలతో టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున జెడ్పీటీసీగా పోటీచేసి ఘన విజయం సాధించి మొదటి సారి బ్రాహ్మణ ఆధిపత్యానికి చెక్‌ పెట్టారు.

Written By: NARESH, Updated On : November 18, 2023 12:26 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: అది బ్రాహ్మణుల కోట.. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి గోదావరి తీరాన ఉన్న ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులదే ఆధిపత్యం.. గుడులు, గోపురాలు.. ఆ కాళేశ్వరుడి సన్నిధానం ఉన్న ఈ మంథని నియోజకవర్గంలో ‘బ్రాహ్మణులే’ గెలుపు ఓటములను శాసించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. అలాంటి బ్రాహ్మణుల ఆధిపత్యం చెలాయిస్తున్న కోటలో ఒక బీసీ వచ్చాడు. పీవీ నరసింహారావు, శ్రీపాదరావు, శ్రీధర్‌బాబులు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బ్రాహ్మణ ఆధిపత్యానికి 2014లో చెక్‌ పెట్టారు. మరి ఈసారి ఏమవుతుంది.. మంథనిలో గెలుపు ఎవరిది? అన్న దానిపై స్పెషల్‌ ఫోకస్‌

స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యేగా..
మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన పుట్ట మధు.. కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత పరిణామాలతో టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున జెడ్పీటీసీగా పోటీచేసి ఘన విజయం సాధించి మొదటి సారి బ్రాహ్మణ ఆధిపత్యానికి చెక్‌ పెట్టారు. తర్వాత ప్రజారాజ్యంలో చేరి 2099లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ, బ్రాహ్మణుల ఆధిపత్యంతో ఓడిపోయారు. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో మంథని పంచాయతీ ఎన్నికల్లో తన భార్య పుట్ట మధును గెలిపించుకున్నారు. మరోసారి మంథనిపై పట్టు నిలుపుకున్నారు. ఈ క్రమంలో 2014లో తెలంగాణ ఏర్పడడంతో వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు.

బీసీకి టికెట్‌ ఇచ్చిన కేసీఆర్‌..
జనరల్‌ స్థానం అయిన మంథనిలో బీసీ బిడ్డ అయిన పుట్ట మధుకు కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పటికే శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా చెక్‌ పెట్టాలని కేసీఆర్‌ మంథనిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికితోడు పుట్ట మధు బీసీ బిడ్డగా అన్నివర్గాలను కలుపుకుపోయారు. ఒక్క ఛాన్స్‌ ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు. అప్పటికే ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబు తీరుతో విసిగిపోయిన మంథని ప్రజలు బీసీ బిడ్డ పుట్ట మధుకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో పుట్ట మధు 80 వేలకు పైగా ఓట్లు రాగా, శ్రీధర్‌బాబుకు 65 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

2018లో మళ్లీ ఓటమి..
అయితే మారిన రాజకీయ పరిణామాలు, పుట్టమధుపై చేసిన తప్పుడు ప్రచారం 2018లో మళ్లీ పుట్ట మధును గెలిపించలేదు. ఈసారి శ్రీధర్‌బాబుకే పట్టం కట్టారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ గాలి ఉన్నా.. మంథని ప్రజలు మాత్రం మార్పు కోరుకున్నారు. చిన్నచిన్న పొరపాట్లు మంథనిలో పుట్ట మధు ఓటమికి కారణమయ్యాయి.

జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా..
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్ట మధు జెడ్పీటీసీగా పోటీచేశారు. కేసీఆర్‌ ఆశీర్వాదంతో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ అయ్యారు. అదే సమయంలో ఆయన భార్య పుట్ట శైలజను మంథని మున్సిపాలిటీ తొలి చైర్‌పర్సన్‌గా గెలిపించుకుని మంథనిపై పట్టు సాధించారు. జెడ్పీ చైర్మన్‌గా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు. మంథని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేయించారు. ప్రభుత్వ సహకారంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో ఈసారి బీఆర్‌ఎస్‌ తరఫున మళ్లీ పోటీ చేయబోతున్నారు. ఈసారి కూడా అగ్రవర్ణ శ్రీధర్‌బాబుతో తలపడుతున్నారు.

అన్నదమ్ముల ఆగడాలతో..
మంథనిలో శ్రీధర్‌బాబు ఎమ్మెల్యే అయితే.. ఆయన సోదరుడు శ్రీనుబాబు షాడో ఎమ్మెల్యే అన్న టాక్‌ ఉంది. ఏం చేయాలన్న శ్రీనుబాబు అనుమతి ఉండాలని అంటారు. అభివృద్ధి పనుల్లో కమీషన్‌ ఇవ్వనిదే పని మొదలు కాదన్న టాక్‌ ఉంది. పంచాయతీలు, సెటిల్‌మెంట్లు చేస్తారని స్థానికంగా అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఐక్యత చాటాలని, నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్‌ పార్టీకి గట్టి గుణంపాఠం చెప్పాలని, చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన మంథని గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలని పుట్ట మధు పిలుపునిచ్చారు.

ప్రచారం జోరుగా..
ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. మరోపు పుట్ట మధు కూడా ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రజా ఆశీర్వాద పాదయాత్ర నిర్వహించారు. మీ ఎమ్మెల్యే మీకోసం పేరుతో ఊరూరా.. వాడ వాడల పాదయాత్ర చేశారు. ఇప్పుడు కూడా మంథని నియోజకవర్గంలో 45 ఏండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉందని, బలహీనవర్గాల ను అణగదొక్కింది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేతను తానేనని, తనను గెలిపించాలని కోరుతున్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

వెయ్యి కోట్లతో అభివృద్ధి..
మంథని ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని ఇటీవల సీఎం ప్రకటించారు. ఇప్పుడు ఇదే నినాదాన్ని పుట్ట మధు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యం అన్న ధీమా క్రమంగా పెరుగుతోంది.

స్థానికంగా ఉంటా..
మరోవైపు మంథనిలో తనను గెలిపిస్తే స్థానికంగా ఉంటానని, శ్రీధర్‌బాబు గెలిస్తే హైదరాబాద్‌ పోతాడని వివరిస్తున్నాడు. ఎన్నికల సమయంలోనే డబ్బుల కట్టలతో మంథనికి వస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తాను ఇక్కడ పుట్టిన బిడ్డగా ఎమ్మెల్యేగా అయినా, జెడ్పీ చైర్మన్‌గా అయినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నానని పేర్కొంటున్నారు. ఓటు వేసేముందు ఆలోచించాలని కోరుతున్నారు.

ఇరువై ఏళ్లుగా ఇద్దరి మధ్యే పోటీ..
మంథనిలో 2003 నుంచి శ్రీధర్‌బాబు, పెట్ట మధు మధ్యనే పోటీ జరుగుతోంది. అగ్రవర్ణ ఆధిపత్యంపై అలుపెరుగని పోరాటం చేసిన పుట్ట మధు 2014లో శ్రీధర్‌బాబును తొలి దెబ్బ తీశారు. 2018లో ఓడిపోయినా జనంలోనే ఉన్నారు. జెడ్పీ చైర్మన్‌గా మధు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా శైలజ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. దీంతో ఈసారి మళ్లీ మధు గాలి వీస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

సొంత ఎజెండాతో..
పుట్ట మధు మంథని కోసం సొంత మేనిఫెస్టో రూపొందించుకున్నారు. గెలిచాక అనేక కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న. ఈ నియోజవకర్గంలో ఎక్కువగా పేదలే ఉన్నందున ప్రతీ ఏడాది ఆడ పిల్లలకు సామూహిక వివాహాలు చేయించాలని, హైదరాబాద్‌లో చదువుకునే మంథని వాసులకు సొంతంగా హాస్టల్‌ వసతి కల్పిస్తానని, గూడులేని పేదలకు ప్రభుత్వం గృహలక్ష్మి కింద ఇళ్లు నిరించి ఇస్తానని, సొంత డబ్బులతో కూడా పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు