https://oktelugu.com/

Telangana Elections 2023 : ఒకరు పేరు మారుస్తామంటారు, మరొకరు మీకోసం స్వర్గాన్ని తెస్తామంటారు

Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో పార్టీలన్నీ ఓటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. ముఖ్యంగా నాయకుల ప్రసంగాలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో మైనార్టీ, మెజార్టీ ఓట్ల బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ముస్లింలు కొన్ని రాష్ట్రాల్లో మైనార్టీ అయితే.. మరికొన్ని రాష్ట్రాల్లో మెజార్టీగా ఉన్నారు. హిందువులు , క్రిస్టియన్లు కూడా అంతే మైనార్టీ, మెజార్టీగా ఉన్నారు. సిక్కులు అన్ని రాష్ట్రాల్లో మైనార్టీ అయితే ఒక్క రాష్ట్రంలో మెజార్టీ. బౌద్దులు, జైనులు నిజమైన మైనార్టీలు వీళ్లే. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2023 / 04:02 PM IST

    Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో పార్టీలన్నీ ఓటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. ముఖ్యంగా నాయకుల ప్రసంగాలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో మైనార్టీ, మెజార్టీ ఓట్ల బ్యాంకు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.

    ముస్లింలు కొన్ని రాష్ట్రాల్లో మైనార్టీ అయితే.. మరికొన్ని రాష్ట్రాల్లో మెజార్టీగా ఉన్నారు. హిందువులు , క్రిస్టియన్లు కూడా అంతే మైనార్టీ, మెజార్టీగా ఉన్నారు. సిక్కులు అన్ని రాష్ట్రాల్లో మైనార్టీ అయితే ఒక్క రాష్ట్రంలో మెజార్టీ. బౌద్దులు, జైనులు నిజమైన మైనార్టీలు వీళ్లే. మిగతా వాళ్లంతా ఒక రాష్ట్రంలో మైనార్టీ, మరో రాష్ట్రంలో మెజార్టీ.

    ఒకసారి మతం పేరుతో విభజించుకున్న దేశం మూడు ముక్కలైంది. ఎస్సీ, బీసీ, రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు. కొత్తగా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించలేదు. మైనార్టీ అంటూ రాజకీయం చేస్తున్న వారు ఇప్పుడు నానా హంగామా చేస్తున్నారు.

    ఒకరు పేరు మారుస్తామంటారు, మరొకరు మీకోసం స్వర్గాన్ని తెస్తామంటారు.. తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.