Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ప్రతీసారి లాగానే గ్రేటర్ హైదరాబాద్ దాని చుట్టు పక్కల ప్రాంతాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు 28 ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కలే ఇవి కీలకంగా ఉన్నాయి. అందులో 24 జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. మరో 4 చుట్టుపక్కలే ఉన్నాయి. సుమారు 119లో 1/4 ఇక్కడే ఉన్నాయి.
సహజంగానే తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధి కీలకంగా ఉంది. అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ కే మొగ్గు చూపిస్తున్నాయి. నిజంగానే అలానే రాబోతున్నాయో లేదా మార్పులు ఉంటాయా? అన్నది చూడాలి.
గ్రేటర్ పరిధిలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 17 బీఆర్ఎస్ నే సాధించింది.మిత్రపక్షం ఎంఐఎం 7 గెలిచింది. అంటే 28లో 24 బీఆర్ఎస్ మిత్రపక్షాలకే దక్కింది.
అదే 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ 55 సీట్లు, బీజేపీ 48 సీట్లు, ఎంఐఎం 44 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు కేవలం 2 మాత్రమే వచ్చాయి. రెండేళ్ల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు రివర్స్ అయ్యాయి. 2023 ఎన్నికల్లో ఏది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందో అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.