MLA Nandamuri Balakrishna: అసలు నందమూరి బాలకృష్ణకు ఏమైంది . రాజకీయాల్లో ఉన్నారన్న మాటే కానీ ఏనాడూ ఆయన వివాదాస్పద అంశాల జోలికి పోలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దూకుడు పెంచారు. ఏకంగా శాసనసభలోనే మీసం మేలేశారు. మంత్రి అంబటి రాంబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు అయితే ఏకంగా సభలోనే ఈలలు వేసి గోల చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు అయితే ఆశ్చర్యపోతున్నారు. బాలకృష్ణ ఇంతకు ముందు ఎన్నడూ ఇలా కనిపించలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
బాలకృష్ణ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా తెగువ చూపలేదు. శాసనసభకు హాజరైనా.. ఎక్కడో ఉండి ఉండనట్టు ఉండేవారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అనంతరం విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీలో ఆయన హడావుడి ఓ రేంజ్ లో ఉంది. నిన్న మీసం మేలేస్తూ వైసీపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. బాలకృష్ణను చూసి బెంబేలెత్తిపోయిన మంత్రి అంబటి రాంబాబు రా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. అయితే బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని వార్నింగ్ ఇచ్చారు. ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్లు ప్రకటించారు. సభను అగౌరవపరిచేలా నడుచుకోవద్దంటూ సూచించారు.
అనంతరం ప్రెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ అందులో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. వైసిపి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి అంబటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. మీసం మేలేస్తూ తన వృత్తిని అవమానపరిచేలా ప్రవర్తించారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ తరుణంలో రెండో రోజు శాసనసభ ప్రారంభంలో సైతం బాలకృష్ణ హడావిడి చేశారు. ఈలలు, గోల తో రచ్చ రచ్చగా మార్చారు. చూసిన వారంతా బాలకృష్ణ ఇదేంటిది ఇలా వ్యవహరిస్తున్నారంటూ అనుకుంటున్నారు. బావను అరెస్టు చేశారన్న బాధతోనే బాలకృష్ణ ఇలా మారిపోయారంటూ సెటైరికల్ గా మాట్లాడుతున్నారు. అయితే మీసం మెలేస్తూ.. వేలిని చూపిస్తూ.. ఈల వేస్తున్న బాలకృష్ణను చూసి వైసిపి ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారు. భలే వినోదం పంచుతున్నారంటూ వ్యంగ్యంగా అభినందిస్తున్నారు.
“సభలో సైకో బాలకృష్ణ”
విజిల్స్ వేస్తూ చట్ట సభను అవమానించిన టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ #TDPGoonsInAssembly pic.twitter.com/KNnWOigM2s
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) September 22, 2023