TDP List : జెండా మోసిన వారు పక్కన.. పొత్తులతో వచ్చిన వారు పైన..

2024 లోనూ అదే పరిస్థితి. కేవలం బాబ్జి మాత్రమే కాదు విశాఖపట్నం జిల్లాలో కీలకంగా ఉన్న టిడిపి నాయకులు మొత్తం చంద్రబాబు వైఖరి పై ఆగ్రహం గా ఉన్నారట. పొత్తుల పేరుతో గెలిచేట్లను ఇతర పార్టీకి అప్పగించడం పట్ల వారు ఆవేదనలో ఉన్నారట. మరి ఈ నేపథ్యంలో సైకిల్ కు పంక్చర్లు కాకుండా చంద్రబాబు ఎలా కాపాడుకుంటారో చూడాలి.

Written By: NARESH, Updated On : March 14, 2024 10:54 pm
Follow us on

TDP List : కష్టపడి పనిచేసిన వారికి ప్రతిఫలం దక్కాలి. అది సహజ న్యాయం కూడా. అలాకాకుండా పని చేయకుండా.. ఒళ్ళును కష్ట పెట్టుకోకుండా వచ్చిన వారికి ప్రతిఫలం ఇస్తే ఎలా ఉంటుంది.. మిగతా ఏ రంగాల్లో ఇలా ఉండదు కానీ.. రాజకీయాల్లో మాత్రం కచ్చితంగా ఉంటుంది. బహుశా అవకాశవాదం అనే పేరు రాజకీయాల నుంచే పుట్టింది కాబోలు. 34 మందితో రెండవ జాబితాను ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో మరింత ఎక్కువగా ఉన్నాయి. పొత్తుల పేరుతో.. ఇన్నాళ్లపాటు కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వకుండా.. వేరే వారికి టికెట్ ఇవ్వడంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు తన పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ దక్కకపోవడంతో రెబల్గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జికి టికెట్ దక్కలేదు. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. గతంలో టికెట్ ఇస్తామని చెప్పడంతో మూడు సంవత్సరాల నుంచి బాబ్జి దక్షిణ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. కోట్లల్లో డబ్బులు ఖర్చు చేశారు.. పార్టీ తరఫున పలు కార్యక్రమాలు చేపట్టారు. తీరా టికెట్ దక్కే సమయంలో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో గండి బాబ్జి మండిపోతున్నారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులు కూడా అదే స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ ఇన్ని రోజులపాటు తమను వాడుకొని వదిలేసిందని అంటున్నారు.

గండి బాబ్జి వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఒకవేళ విశాఖపట్నం సౌత్ దక్కకపోయినా.. మాడుగుల స్థానమైనా ఇస్తామని పార్టీ పెద్దలు మొన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చారట. ఇప్పుడు ఆ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించడంతో.. గండి బాబ్జికి తన భవిష్యత్తు ఏమిటో అర్థమైంది. అందుకే టిడిపికి రాజీనామా చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటో త్వరలో చెబుతానని ప్రకటించారు. వాస్తవానికి బాబ్జి తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ ద్వారా ప్రారంభించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004లో పరవాడ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టిడిపిలో చేరినప్పటికీ టికెట్ దక్కలేదు. 2024 లోనూ అదే పరిస్థితి. కేవలం బాబ్జి మాత్రమే కాదు విశాఖపట్నం జిల్లాలో కీలకంగా ఉన్న టిడిపి నాయకులు మొత్తం చంద్రబాబు వైఖరి పై ఆగ్రహం గా ఉన్నారట. పొత్తుల పేరుతో గెలిచేట్లను ఇతర పార్టీకి అప్పగించడం పట్ల వారు ఆవేదనలో ఉన్నారట. మరి ఈ నేపథ్యంలో సైకిల్ కు పంక్చర్లు కాకుండా చంద్రబాబు ఎలా కాపాడుకుంటారో చూడాలి.