TDP – Janasena List : బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ మరోసారి ఆ వర్గాలను తాజా జాబితాలో సైడ్ చేసేసింది టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు మరోసారి నిరాశ ఎదురైంది. చంద్రబాబు అగ్రవార్ణాలపైనే ప్రేమ చూపించారు.
చంద్రబాబు ప్రకటించిన 94మంది అభ్యర్థుల్లో బీసీలకు కేటాయించిన సీట్లు కేవలం 18 మాత్రమే. అంటే మొత్తం జనాభాలో 45శాతం బీసీలు ఉంటే ఆ వర్గాలకు కేటాయించిన సీట్లు 18 సీట్లు ఇచ్చి మరోసారి మోసం చేశాడు.
2014లో 43 స్థానాలు బీసీలకి ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేవలం 18 సీట్లు మాత్రమే ఇచ్చాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న మాటను నిజం చేసి చూపించాడు. మైనారిటీ వర్గాలను మరీ నీచంగా చూస్తూ కేవలం ఒక్క స్థానమే చంద్రబాబు కేటాయించారు.
కానీ కేవలం 4.5శాతం జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకు మాత్రం 20 స్థానాలు కేటయించారు. ఇక కాపులకు 7 సీట్లు మాత్రమే ఇచ్చారు.
రాష్ట్రంలో 20 శాతానికిపైగా ఉన్న కాపు సామాజిక వర్గాలకు చంద్రబాబు కేటాయించిన సీట్లు కేవలం 7 మాత్రమే. దీంతో కాపు వర్గం నాయకులు చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారని ఆగ్రహంతో ఉన్నారు. ఇక మిగిలిన 57 సీట్లలోనూ బీసీ, మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తారన్న నమ్మకం లేదు.
2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలను మోసం చేశాడు. కేవలం అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే రాజ్యసభకు పంపారు.
తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశంలో అసమ్మతి భగ్గుమంటోంది. బీకే పార్థసారథికి సీటు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వర్గీయులు ప్లెక్సీలను దహనం చేశారు.