https://oktelugu.com/

Chandrababu : బీకాంలో ఫిజిక్స్ లాగా.. ఇంజినీరింగ్ లో ‘బైపీసీ’నా బాబు?

ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మన చంద్రబాబుకు ఇంత కూడా చదువులపై అవగాహన లేదని అర్థమవుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2023 / 09:52 AM IST
    Follow us on

    Chandrababu : ‘బీకాంలో ఫిజిక్స్ అని’ ఓ నేత చెప్పిన డైలాగ్ ఇప్పటికీ పాపులర్. నాగరాజు అనే యూట్యూబ్ జర్నలిస్ట్ ఇలాంటి అవగాహన లేని నేతలతో తప్పులు చేయించడంలో దిట్ట. అలాగే బండి సంజయ్ ను కూడా ఇరికించాడు. వాళ్ల నాన్న ఉద్యోగాన్ని తప్పుగా పలికించి దొరకబెట్టాడు. అది పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది.

    ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మన చంద్రబాబుకు ఇంత కూడా చదువులపై అవగాహన లేదని అర్థమవుతోంది. డిగ్రీ వరకూ చదివాడని అంటున్న పెద్దమనిషి అసలు అది చదివాడా కాపీ కొట్టాడా? అన్నది కూడా తెలియదు.

    ఇక హైదరాబాద్ నిర్మించింది నేనే. ఐటీని డెవలప్ చేసింది నేనే అంటూ ఊదరగొట్టే చంద్రబాబుకు ఈ టెక్నాలజీ చదువులపై కనీస ఇంగితం కూడా లేదన్న విషయం అర్థమైంది. విశాఖలో చంద్రబాబు విజన్ 2048 విడుదలకు టీడీపీ శ్రేణులు భారీ ప్రచారం చేశారు. విశాఖ నగరంలో చంద్రబాబు బీచ్ రోడ్ లో నిర్వహించిన సభకు జన స్పందన రాలేదు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ విజన్ 2047 సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. బాబును జనాలు తెగ ట్రోల్ చేస్తున్నారు.

    ‘ఇంటర్ లో ఇంజినీర్ కావాలంటే బైపీసీ చేయాలంటూ’ చంద్రబాబు నోరుజారారు. ఇంజినీర్ కావాలంటే చేయాల్సింది ఎంపీసీ అని.. బాబుకు ఆ మాత్రం కూడా తెలియదు అంటూ టీడీపీలో చేరిన అప్పట్లో జలీల్ ఖాన్ అన్న ‘బీకాంలో ఫిజిక్స్’ వీడియోలను.. బాబు వీడియోలను పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు ఇజ్జత్ తీస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.