https://oktelugu.com/

T20 World Cup 2024 : India vs Pakistan మ్యాచ్‌ తేదీ, సమయం, టికెట్ల ధరలు ఇవే..

భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ అమెరికాలోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానంలో 34 వేల మంది కూర్చునే అవకాశం ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 18, 2024 / 08:01 PM IST
    Follow us on

    T20 World Cup 2024 : India vs Pakistan : టీ20 ప్రపంచకప్‌లో జూన్ 9న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో దాయాది జట్లు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో భారత్‌ 6-1తో ఆధిక్యంలో ఉంది. 2021లో పాకిస్థాన్‌ భారత్‌పై విజయం సాధించింది. ఇక 2024 టీ20 భారత్‌ – పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ వీక్షించే వారు ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు టికెట్‌ ధరలు 15 యూఎస్‌ డాలర్ల నుంచి మొదలవుతాయి.

    ఏడుసార్లు తలపడ్డ దాయాది జట్లు..
    ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ పోటీల్లో ఇప్పటి వరకు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. 2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి 2022 వరకు జరిగిన ఏడు టోర్నీల్లో భారత్‌ ఆరు సార్లు పాకిస్థాన్‌పై విజయం సాధించింది. జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఇంతకు ముందు ఏడు సార్లు భీకర పోరాటాలు జరిగాయి (రెండుసార్లు, ఫైనల్‌తో సహా), 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021 మరియు 2022ల్లో మ్యాచ్‌లు జరుగగా 2021లో మినహా మిగతా అన్ని మ్యాచ్‌లలో భారత్‌ విజయం సాధించింది. 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ సంచలన ప్రదర్శనతో భారత ట్రోఫీలో సంచలన విజయం నమోదు చేసింది. అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో భారత్‌ పాకిస్థాన్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2021 టీ20 టోర్నీ దుబాయ్ వేదికగా జరుగగా, 2022 టోర్నీ ఆస్ట్రేలియాలో జరిగింది. ఇక 2024 టీ20 టోరీ‍్ట అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భారత్‌ – పాకిస్థాన్‌ మ్యాచ్‌ అమెరికాలోని లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానంలో 34 వేల మంది కూర్చునే అవకాశం ఉంది.

    మ్యాచ్‌ సమయమిదీ..
    భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరు జూన్‌ 9న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 8 గంటలకు టాస్‌ వేస్తారు. 8:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.

    ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం..
    న్యూయార్క్‌లో జరిగే ఇండియా – పాకిస్థాన్‌ టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌ కోసం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ప్రారంభ ధర 15 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది. టీ20ఐ ప్రపంచకప్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

    ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ ఇలా కొనుగోలు చేయాలి:
    1. టీ20 అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేయండి.
    2. టీ20 ప్రపంచ కప్ 2024 యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ని సందర్శించండి.
    3. షెడ్యూల్‌లో “ఇండియా vs పాకిస్తాన్” టీ20 మ్యాచ్‌ను ఎంచుకోండి
    4. మీకు ఇష్టమైన సీటింగ్, టిక్కెట్ రకాన్ని ఎంచుకోండి.
    5. మీ కార్ట్‌కు టిక్కెట్‌లను జోడించండి.
    6. ప్రాధాన్య చెల్లింపు మోడ్‌ను ఎంచుకుని, లావాదేవీని పూర్తి చేయండి.
    7. మీరు బుక్ చేసిన టిక్కెట్ల వివరాలతో నిర్ధారణ ఇమెయిల్ లేదా అందుకుంటారు.
    8. మ్యాచ్ రోజున ప్రవేశం కోసం మీ ఇ-టికెట్‌లను డౌన్‌లోడ్ చేయండి లేదా యాక్సెస్ చేయండి.