New Year Celebrations: నాన్నకు ప్రేమతో సినిమా చూశారా.. అందులో నిద్ర, ఆకలి, సె** అనేవి మనుషులకు, జంతువులకు కామన్. అని ఆ రెండింటిని వేరు చేసేదే ఎమోషన్ అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. అతడు చెప్పినట్టు మనుషుల్లో ఉండే ఆ ఎమోషనే జంతువుల కంటే భిన్నంగా ఉంచుతుంది. కానీ ఇప్పుడు ఆ ఎమోషన్ పక్కన మద్యపానం కూడా చేర్చాలేమో. ఎందుకంటే జంతువులు మద్యాన్ని తీసుకోలేవు కాబట్టి. పైన చెప్పినట్టు నూతన సంవత్సరం సందర్భంగా మద్యాన్ని తెలంగాణ ప్రజలు
వీర లెవెల్ లో తీసుకున్నారు. అంతే కాదు
క*** ప్యాకెట్లు కొని ఆ తిన్నది అరిగేదాకా శారీరక సౌఖ్యాన్ని పొందారు. పీకల దాకా తాగి.. ప్రభుత్వానికి టాక్స్ పేయర్స్ సత్తా చూపించారు. ప్రభుత్వం కూడా తాగే సౌకర్యాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు కల్పించడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి 8 గంటలకే రోడ్ల మీదకు వచ్చి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేశారుగాని.. లేకుంటే మందుబాబుల వీరంగం మరో రేంజ్ లో ఉండేది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఎవరెవరు ఏం కొన్నారో.. వేటిమీద ఆసక్తి చూపించారో.. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ “స్విగ్గి” పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
2023 కు వీడ్కోలు పలుకుతూ, 2024 కు స్వాగతం పలుకుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు నిమిషానికి 1,244 బిర్యానీ లు ఆర్డర్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు 4.8 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేసి గత రికార్డులను తిరగ రాశారు.. గతంతో పోలిస్తే 1.6 రెట్ల ఆర్డర్లు అందుకున్నామని స్విగ్గి ప్రకటించింది. క్రికెట్ వరల్డ్ కప్_23 ఫైనల్ సందర్భంగా తమకు ఈ రేంజ్ లో ఆర్డర్లు వచ్చినప్పటికీ.. దానికి మించే లాగా 1.3 లక్షల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు బిర్యానీలో రకరకాల వెరైటీలు ఆర్డర్ చేశారని.. మొదటి స్థానం చికెన్ బిర్యాని ఉండగా.. మటన్ బిర్యాని, వెజ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మాశ్రుం బిర్యానీ ఉన్నాయని స్విగ్గి వివరించింది. గతంలో చికెన్ బిర్యాని మాత్రమే ఆర్డర్ చేసేవారని.. ఈసారి మాత్రం హైదరాబాద్ ప్రజలు రకరకాల రుచులు కోరుకున్నారని స్విగ్గి వివరించింది. ప్రభుత్వం ఇచ్చిన వెసలు బాటు ప్రకారం తాము ప్రజలకు దాదాపు తెల్లవారుజామున రెండు గంటల వరకు సేవలు అందించామని స్విగ్గి పేర్కొన్నది..
కేవలం తిండి మాత్రమే కాదు శారీరక సౌఖ్యంలో కూడా దేశ ప్రజలకు ముందున్నారు. స్విగ్గి మార్ట్ ద్వారా దేశ వ్యాప్తంగా నిమిషానికి 1,722 కం** లు ఆర్డర్ చేశారు.. వీటిని కూడా తెల్లవారుజామున రెండు గంటల వరకు తాము కస్టమర్లకు డెలివరీ చేశామని స్విగ్గి ప్రకటించింది. అయితే ఇలా కండోమ్స్ ఆర్డర్ చేసిన వారిలో అన్ని వయసుల వారు ఉన్నారని, ముఖ్యంగా యువకులు అందులో యువతులు కూడా ఉన్నారని స్విగ్గి వివరించింది. గతంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్_23 సందర్భంగా కం** లు భారీగా కొనుగోలు చేశారని.. కానీ ఈసారి ఆ రికార్డును న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బ్రేక్ అయిందని స్విగ్గి తెలిపింది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. కేవలం 6 రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా మద్యం అమ్మకాలు తెలంగాణ రాష్ట్రంలో సాగాయి. నాలుగు రోజుల్లో రాష్ట్ర ఖజానాకు 771 కోట్లు సమకూరాయి. 30వ తారీఖున గరిష్టంగా 313 కోట్ల అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా సాగాయి. ఇక డ్రంకెన్ డ్రైవ్ కేసులు 4,500 దాకా నమోదయ్యాయి. డిసెంబర్ 28, 29, 30, 31 తేదీలలో సుమారు 771 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు చేరాయి.. డిసెంబర్ 30న అత్యధికంగా 313 కోట్లు, 31న 150 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28,29 తేదీలలో 254 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి మూడు రోజుల్లో 6.51 లక్షల బీర్ కేసులు, 4.80 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడుపోయాయి.. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు బార్లు ఓపెన్ గా ఉండడంతో తాగినోళ్లకు తాగినంత మద్యం లభించింది. డిసెంబర్ 30న 310 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.. గత ఏడాది 250 కోట్లకు పైగా విలువైన మద్యం.. షాపులకు తరలి వెళ్ళింది. కాగా ఆ రికార్డును ఈ ఏడాది అధిగమించింది. ఇక చివరి నాలుగు రోజుల మద్యం అమ్మకాలను ఒక్కసారి గమనిస్తే.. 2021లో డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లో 600 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.. 2022లో అది 775 కోట్లకు పెరిగింది. 2023లో 771 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా 4,500 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.. ఇందులో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో 3,254 కేసులు నమోదు కావడం విశేషం.